TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఛైర్మన్‌తోపాటు సభ్యుల నియామానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించింది. టీఎస్‌పీఎస్‌సీకి సంబంధించి గ్రూప్స్ పేపర్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ రాజీనామా చేశారు.
Sujana Chowdary: విజయవాడ ఎంపీగా సుజనా చౌదరి.. జనసేన-టీడీపీతో పొత్తు లేదా..?
పేపర్ లీక్ అంశం తర్వాత కూడా బీఆర్ఎస్ హయాంలో వీళ్లు టీఎస్‌పీఎస్‌సీలోనే కొనసాగారు. అయితే, గత నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో తాజాగా రాజీనామా చేశారు. డిసెంబర్ 11న జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం మిగతా ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఈ నెల 10న ఆమోదించారు. దీంతో ప్రస్తుతం టీఎస్‌పీఎస్‌సీ ఖాళీగానే ఉంది. ఛైర్మన్, సభ్యుల భర్తీ జరిగితే ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వంటివి ముందుకు సాగుతాయి. దీంతో ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది గ్రూప్స్ పేపర్ లీకేజీ వ్యవహారం తెరమీదకు వచ్చిన తర్వాత టీఎస్‌పీఎస్‌సీ బోర్డుపై తీవ్ర విమర్శలొచ్చాయి.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. బోర్డును ప్రక్షాళన చేయాలని సూచించాయి. కానీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడతో బోర్డు సభ్యులు వైదొలిగారు.