TSPSC GROUP 1: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..

గతంలో 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలకాగా.. ఇప్పుడు 60 పోస్టులు పెంచి, మొత్తం 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానుంది.

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 07:52 PM IST

TSPSC GROUP 1: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది టీఎస్‌పీఎస్‌సీ (తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్). సోమవారం సాయంత్రం గ్రూప్-1 నోటిఫికేష్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. గతంలో 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలకాగా.. ఇప్పుడు 60 పోస్టులు పెంచి, మొత్తం 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ.

KCR: ఈ వారం ఢిల్లీ టూర్‌కు కేసీఆర్‌.. బీజేపీతో పొత్తు ఖాయమేనా..?

ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానుంది. మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడాచ్చు. మరోవైపు ఉద్యోగ ప్రకటన ఆలస్యమైన నేపథ్యంలో అభ్యర్థుల వయో పరిమితిని రేవంత్ సర్కార్ ఇటీవల పెంచిన సంగతి తెలిసిందే. వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మాత్రం వయోపరిమితి నుంచి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు నిర్దేశించిన గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాలాకాలంగా తెలంగాణ నిరుద్యోగ యువత రాష్ట్రంలో గ్రూప్-1 సహా చాలా పోటీ పరీక్షల కోసం ఎదురుచూస్తోంది.

ఇప్పటికే వివిధ పరీక్షలకు సంబంధించి కొన్ని పోస్టుల్ని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తోంది. దాదాపు రెండేళ్లక్రితమే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకాగా, పేపర్ లీకైన సంగతి తెలిసిందే. దీంతో పరీక్షల్ని ప్రభుత్వం రద్దు చేసింది. రెండోసారి నిర్వహించిన ఎగ్జామ్‌లలో కూడా అవకతవకలు జరగడంతో తాజాగా పాత నోటిఫికేషన్‌నే పూర్తిగా రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ విడుదల కావడంతో పరీక్షలు సజావుగా సాగుతాయని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.