TSRTC: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లో 10 శాతం డిస్కౌంట్

తాజాగా అందుబాటులోకి తెచ్చిన లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమలులో ఉంటుంది.

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 07:15 PM IST

TSRTC: ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అందుబాటులోకి తెచ్చిన లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమలులో ఉంటుంది. వేసవిలో సుదూరంలో ఉన్న సొంతూళ్లకు వెళ్లేవాళ్లకు ఈ రాయితీ ప్రయోజనం కలిగిస్తుంది.

Mukesh Ambani: రిటర్న్‌ గిఫ్ట్ అదుర్స్‌.. అతిథుల‌కు అంబానీ ఫ్యామిలీ రిట‌ర్న్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..

స్లీపర్ బస్సుల్ని టీఎస్ఆర్టీసీ నడుపుతున్న సంగతి తెలిసిందే. వీటిలో హాయిగా ఏసీలో, పడుకుని ప్రయాణించే వీలుంటుంది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ పేర్లతో అందుబాటులో ఉన్న ఈ బస్సులు తెలంగాణలోని పలు పట్టణాలకు, అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా నడుస్తున్నాయి. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా.. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు, గోదావరిఖని-బెంగళూరు, కరీంనగర్-బెంగళూరు, నిజామాబాద్ -తిరుపతి, నిజామాబాద్ -బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి.

ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఈ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ 10 రాయితీ వర్తిస్తుంది. సాధారణ టికెట్‌ ధరలో ప్రయాణికులు బుక్‌ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ అందుతుంది.