Jharkhand, Money Laundering : జార్ఖండ్ మనీలాండరింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్

జార్ఖండ్ మనీలాండరింగ్ (Money Laundering) కేసులో ఈడీ ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్తో పాటు ఆయన ఇంటి పనిమనిషి జహంగీర్ ఆలంను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

జార్ఖండ్ ఈడీ (ED) దాడుల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. మంత్రి ఆలంగీర్‌ కార్యదర్శి సంజీవ్‌ పని మనిషి ఇంట్లో సోదాలు చేసిన సమయంలో గుట్టలు గుట్టలు నోట్ల కట్టలు బయటపడ్డా విషయం తెలిసిందే..

జార్ఖండ్ మనీలాండరింగ్ (Money Laundering) కేసులో ఈడీ ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్తో పాటు ఆయన ఇంటి పనిమనిషి జహంగీర్ ఆలంను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాంచీలో జహంగీర్ ఆలం ఇంట్లో రూ.35.23 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. గతంలో మనీల్యాండరింగ్‌ కేసులో చీఫ్ ఇంజినీర్‌ను గతేడాది అరెస్టు చేశారు. ఇదే కేసులో నిన్న జార్ఖండ్‌లోని రాంచీలో 10 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. మనీల్యాండరింగ్ నిరోధకం చట్టం కింద ఫిబ్రవరి 2023లో అరెస్టయిన వీరేంద్ర రామ్‌కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఇక మరోవైపు రోడ్ కన్స్‌స్ట్రక్షన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇంజనీర్‌ వికాస్‌ కుమార్‌ ఆచూకీ కోసం మరో ఈడీ బృందం బరియాతు, మోరబాది, బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహించిందని అధికారులు వెల్లడించారు.

Suresh SSM