Hyderabad to Ayodhya : హైదరాబాద్ నుంచి అయోధ్యకు… రెండు గంటల ప్రయాణం !

అయోధ్యలో బాలక్ రాముడి దర్శనానికి వెళ్ళడానికి ఇకపై ప్రయాసలు అక్కర్లేదు.

అయోధ్యలో బాలక్ రాముడి దర్శనానికి వెళ్ళడానికి ఇకపై ప్రయాసలు అక్కర్లేదు. డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి అయోధ్య వరకూ ఫ్లయిట్ లో రెండు గంటల్లోనే వెళ్ళొచ్చు. ఇవాళ్టి (మంగళవారం) నుంచే విమానాలు నడుస్తున్నాయి. వారంలో మూడు రోజుల పాటు శంషాబాద్ నుంచి నుంచి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.

అయోధ్యలో కొలువుదీరిన బాలరామయ్యను చూడటానికి ఇకపై హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఫ్లయిట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. మంగళవారం నుంచి విమానాలను తిప్పుతున్నారు. ఇన్నాళ్ళు ఢిల్లీ లేదా కోల్ కతాకు వెళ్ళి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్ ద్వారా అయోధ్యకు చేరుకోవాలి. ఇలా వెళ్ళడానికి 5 నుంచి 10 గంటల టైమ్ పట్టేది. 10 నుంచి 15 వేల రూపాయల దాకా ఖర్చయ్యేది. అలాగే సికింద్రాబాద్ నుంచి రైల్లో వెళ్ళాలంటే 30 గంటల టైమ్ పడుతుంది. అంతేకాకుండా అయోధ్య, లక్నో, గోరఖ్ పూర్ కి రెగ్యులర్ గా ట్రైన్లు కూడా ఇక్కడి నుంచి అందుబాటులో లేవు. అందుకే చాలామంది భక్తులు అయోధ్య వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు విమాన సౌకర్యం అందుబాటులోకి రావడంతో… స్పైస్ జెట్ ఫ్లయిట్ ద్వారా శంషాబాద్ నుంచి అయోధ్యకు 7వేల నుంచి 9 వేల రూపాయల ఖర్చుతో వెళ్ళొచ్చు. వారానికి మూడు రోజుల పాటు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. రెండు గంటల్లేనే అయోధ్య చేరుకునే అవకాశం రావడంతో… బాల రాముడి దర్శనం కోసం చాలా మంది టిక్కెట్లు బుక్ చేయించుకుంటున్నట్టు ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.