Train Accident : పశ్చిమ బెంగాల్‌లో రెండు రైళ్లు ఢీ.. కోరమాండల్ రైలు ప్రమాదం తరహలో మరో ఘోర రైలు ప్రమాదం

దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లో రెండు రైళ్లు ఢీ కొన్న ఘటన డార్జిలింగ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒడిశా కోరమాండల్ రైలు ప్రమాదం మరువకముందే.. సరిగ్గా ఇదే నెలలో మరో ఘోర రైలు ప్రమాదం.. దాదాపు అదే ప్రమాదాన్ని తలపించేలా వెస్ట్ బెంగాల్ రైలు ప్రమాదం..

దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లో రెండు రైళ్లు ఢీ కొన్న ఘటన డార్జిలింగ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒడిశా కోరమాండల్ రైలు ప్రమాదం మరువకముందే.. సరిగ్గా ఇదే నెలలో మరో ఘోర రైలు ప్రమాదం.. దాదాపు అదే ప్రమాదాన్ని తలపించేలా వెస్ట్ బెంగాల్ రైలు ప్రమాదం..

2024 బెంగాల్ రైళ్లు ప్రమాదం..

పశ్చిమ బెంగాల్ లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. డార్జిలింగ్ జిల్లాలోని న్యూజల్‌పాయ్‌గుడిలో గూడ్స్ రైలును కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 5 దుర్మరణం చెందినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 30 మంది వరకు గాయపడినట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని బోగీలు పక్కకు జరిగాయి. ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఎదురెదురుగా ఢీ కొన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన రంగపాణి – నిజ్బారి వద్ద చోటుచేసుకుంది.

2023 ఒడిశా రైలు ప్రమాదం..

కాగా ఈ ప్రమాదం ఇంచుమించు గత సంవత్సరం 2023 ఒడిశా రైలు ప్రమాదం తలపిస్తుంది. గత సంవత్సరం సరిగ్గా ఇదే నెల జూన్ లో.. ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 2023 జూన్ 2న రాత్రి 7 గంటల సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. ట్రాక్‌పై పడిన ఈ రైలు బోగీలను యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్‌ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయపడినారు. ఈ ఘోర రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందారు.

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..

ఇక ఈ రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్‌ రైలు ఢీ కొట్టినట్లు ఆమె తెలిపారు. ఈ రైలు ప్రమాద ఘటన షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నారు.