Boy In Borewell: ప్రాణం కాపాడారు.. బోరుబావి నుంచి సేఫ్‌గా సాత్విక్‌ రెస్క్యూ..!

సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాయి. కర్నాటక స్టేట్‌ డిజాస్టర్‌ రెస్క్యూ ఫోర్స్‌, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్క్యూ ఫోర్స్‌ సంయుక్తంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. 16 అడుగుల బోరుబావికి సమాంతరంగా 21 అడుగుల సొరంగం తవ్వారు.

  • Written By:
  • Publish Date - April 4, 2024 / 06:50 PM IST

Boy In Borewell: 21 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సాత్విక్‌ను కాపాడారు SDRF టీం. కర్నాటకలోని లచయానా విలేజ్‌లో జరిగింది ఈ ఇన్సిడెంట్‌. ఏప్రిల్‌ 3 సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో పొలం దగ్గర ఆడుకుంటున్న సాత్విక్‌ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయాడు. సాత్విక్‌ బావిలో పడటం వాళ్ల తల్లిదండ్రులు చూడలేదు. చాలా సేపు సాత్విక్‌ కనిపించకపోవడంతో అక్కడంతా వెతికారు. కాసేపటికి బోరుబావి నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో సాత్విక్‌ బావిలో పడ్డట్టు గుర్తించారు.

Vijayashanti: రాములమ్మ ఎక్కడ..? పొలిటికల్‌ సీన్‌లో కనిపించని విజయశాంతి.. పట్టించుకోని కాంగ్రెస్..

ఈ సమాచారం అందుకున్న సహాయక బృందాలు మెరుపు వేగంతో అక్కడికి చేరుకున్నాయి. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాయి. కర్నాటక స్టేట్‌ డిజాస్టర్‌ రెస్క్యూ ఫోర్స్‌, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్క్యూ ఫోర్స్‌ సంయుక్తంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. 16 అడుగుల బోరుబావికి సమాంతరంగా 21 అడుగుల సొరంగం తవ్వారు. కెమెరా సహాయంతో చిన్నారి ఉన్న స్పాట్‌ను గుర్తించారు. సాత్విక్‌ ఉన్న స్పాట్‌ డిటెక్ట్‌ అవ్వడంతో.. వెంటనే సాత్విక్‌ను బయటికి తీసి హాస్పిటల్‌కు తరలించారు. సాత్విక్‌ కోసం 21 గంటలు ఆ తల్లిదండ్రులు పడ్డ ఆరాటం వర్ణనాతీతం. లచయానా గ్రామంలో.. సాత్విక్‌ క్షేమంగా రావాలని దేవుడికి మొక్కని చెయ్యిలేదు. భగవంతున్ని ప్రార్థించని మనిషి లేడు. రోజు కళ్లముందే ఆడుకునే బోసినవ్వుల చిన్నారు. 16 అడుగుల లోతులో నరకం లాంటి ప్రాంతంలో పడిపోయాడని తెలిసి ప్రతీ ఒక్కరూ తల్లిడిల్లిపోయారు.

చిన్నారి కోసం బోరుబావి దగ్గరే కూర్చుని ఆ తల్లిదండ్రులు ఏడ్చిన ఏడుపు ప్రతీ ఒక్కరిచేత కంటతడి పెట్టించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరికి ఊపిరి అల్లుకుంటూ 21 గంటలు బోరుబావిలో ఆ చిన్నారి అనుభవించిన నరకం ఊహించుకునేంటేనే ఒళ్ల జలదరిస్తుంది. ఇండీలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చిన్నారినికి ట్రీట్‌మెంట్‌ జరుగుతోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. చాలా సేపు చీకటిలోనే అంత లోతులో ఉండటంతో సాత్విక్‌ షాక్‌లో ఉన్నాడని చెప్తున్నారు. ఇంకా మెడికల్‌ టెస్టులు కూడా సాత్విక్‌ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో టెస్ట్‌లు నిర్వహించిన తరువాత సాత్విక్‌ను డిశ్చార్జ్‌ చేస్తామంటున్నారు డాక్టర్లు.