ఒకరోజు పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు.
తెలంగాణలో అమిత్ షా పర్యటన..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ లో ఉండాల్సిని అమిత్ షా.. గంట సేపు ఆలస్యంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని అమిత్ షా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు ఆయన వస్తున్నట్లు పేర్కొంది. 1:25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఆయన మధ్యాహ్నం 1:40 నుంచి 2:40 వరకు నోవాటెల్ లో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో లంచ్ మీట్ లో పలు అంశాలపై చర్చించనున్నారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 3:05 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. అనంతరం 3:50 గంటలకు కొంగర కలాన్ లోని శ్లోక కన్వెన్షకు చేరుకుంటారు. 3:50 నుంచి 5:20 వరకు బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ లో 2024 లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీయనున్నారు. కొంగరకలాన్ శ్లోక కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసిన అనంతరం అమిత్ షా ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.