Weather Update : అకాల వర్షాలు.. 13 మంది మృతి.. హైదరాబాద్కు రెండ్రోజులు వర్షసూచన..!

హైదరాబాద్ 9Hyderabad), మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం గాలివాన (Wind Rain) బీభత్సం సృష్టించింది. చాలాచోట్ల ఈదురుగాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి.

హైదరాబాద్ 9Hyderabad), మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం గాలివాన (Wind Rain) బీభత్సం సృష్టించింది. చాలాచోట్ల ఈదురుగాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. నేడు, రేపు గ్రేటర్ హైదరాబాద్ (GHMC) లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

నిన్న రాష్ట్రంలో ఈదురుగాలులు, అకాల వర్షాల ధాటికి వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మరణించారు. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు చనిపోగా.. ఇదే జిల్లాలో తాండూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల షెడ్డు షెడ్డు కూలడంతో తండ్రీకూతుళ్లు సహా నలుగురు, పిడుగుపాటుతో ఇద్దరు, ఓ డ్రైవరు చనిపోయారు. రాజధాని హైదరాబాద్ లో నలుగురు, మెదక్ లో శామీర్పేటలో చెట్టు కొమ్మ విరిగిపడి బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. మరోవైపు పలు జిల్లాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. జగిత్యాలలోని జైనలో అత్యధికంగా 46.5 డిగ్రీలు నమోదైంది. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.