రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు.. ఆరోపణలు చేయొచ్చు.. ప్రత్యర్థి పార్టీ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దు. ఐతే వైసీపీ నేత చేసిన పని.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో ఛీ అనిపిస్తోంది. ఫ్రస్ట్రేషన్‌లో చేస్తున్నారో.. పగ పట్టి చేస్తున్నారో కానీ.. వాళ్లు చేస్తున్న పనులతో మరింత దిగజారుతున్నారు అనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం మీద.. మరీ ముఖ్యంగా జనసేన, పవన్ కల్యాణ్ మీద టార్గెట్ చేసినట్లు ఏదో ఒక రచ్చ చేయడం వైసీపీకి అలవాటుగా మారిపోయిందనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఓ వైసీపీ లీడర్ చేసిన పని.. ఇప్పుడు జనసైనికుల రక్తం ఉడికిపోయేలా చేస్తోంది. ఏ పార్టీ అయినా సరే.. తమ పార్టీ జెండాను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. ఐతే జనసేన పార్టీ జెండాపై వైసీపీ నేత చేసిన పాడు పని ఇప్పుడు ప్రతీ ఒక్కరితో ఛీకొట్టేలా చేస్తోంది. జనసేన పార్టీ జెండాపై వైసీపీ నేత మూత్రం పోసి అవమానించాడు. ఈ విషయం తెలుసుకున్న జనసైనికులు.. ఆ లీడర్ మీద భగ్గుమంటున్నారు. వైసీపీ యూత్ లీడర్ బెజవాడ హర్ష ఈ పాడుపనికి పాల్పడ్డాడు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి సెంటర్‌లో… అర్ధరాత్రి మద్యం సేవించి ఫార్చునర్ కారులో వెళుతూ రివర్స్ వచ్చిన హర్ష.. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన జనసేన నేత కారుపై ఉన్న పార్టీ జెండాపై.. మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందాడు. మూడు రోజుల కిందే ఈ ఘటన జరిగినా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పార్టీ జెండాను ఘోరంగా అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారని.. జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మూకుమ్మడి ఫిర్యాదుల కార్యక్రమంను చేపట్టేందుకు జనసైనికులు రెడీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ ఫోటోతో కూడిన పార్టీ జెండా అవమానానికి గురైనా.. ఇంత అలసత్వం ఏంటి అని నిలదీస్తున్నారు. నిందితుడిని కాపాడేందుకు కొందరు కూటమి నాయకులే రాజీ చర్చలకు వస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.