Elisabeth Anderson: తన లోపాన్ని లోకహితం కోసం ఉపయోగించి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది

తల్లి అంటేనే సృష్టికి మాలాధారం. పిండం పెరుగుదల మొదలు బిడ్డ ఎదుగుదల వరకూ అన్నీ తానై కడుపులో కొంతకాలం, గుండెల్లో మిగిలిన కాలం పెట్టుకొని చూసుకుంటుంది. అమ్మకు ఎవరి బిడ్డలైనా తన సొంత బిడ్డలాగే చూసుకుంటుంది. అలా భావిస్తేనే నిజమైన మాతృమూర్తికి నిదర్శనం అని చెప్పాలి. తాజాగా ఇలాంటి ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. తాను చేసిన ధాతృత్వానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఈ తల్లి పాదాల చెంతకు చేరింది.

  • Written By:
  • Publish Date - July 16, 2023 / 06:21 PM IST

ప్రపంచంలో రక్తదానం, ఫ్లాస్మా దానం గురించి చూసి ఉంటాం. అవయవ దానం అనే మాట వినిఉంటాం. వీటన్నింటికీ భిన్నంగా ఒక మహిళ తల్లిపాల దానం చేసింది. అది కూడా అరకొరగా కాదు సంపూర్ణానికి పూర్ణత్వాన్ని ఇచ్చేలా చేసింది. ఈమె పేరు ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన బిడ్డలకు పాలు ఇస్తూనే మదర్ ఫీడ్ డొనేషన్ బ్యాంకులో 2015 నుంచి 2018 వరకూ చనుపాలను విరాళంగా ఇవ్వడం ప్రారంభించారు. అలా మూడేళ్లుగా ఇస్తూనే ఉన్నారు. అవి కాస్త 1600 లీటర్లకకు చేరుకుంది. దీంతో ఈమె చేసిన మహోదయ కార్యక్రమాన్ని గుర్తించింది అమెరికాలోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. నవజాత శిశువులకు పాలు అందించేందుకు తోర్పడిన ఈమె సేవలను కొనియాడుతూ ఈ రికార్డ్ ను అందజేసింది.

ఇదిలా ఉంటే ఈ పాలు దానం చేసే కాన్సెప్ట్ వెనుక ఒక మానవీయమైన ఘట్టాన్ని ఆమె స్వయంగా చూశారు. ఈ విషయాలను మీడియా ముఖంగా పంచుకున్నారు. నా భర్తది ప్యూర్టెరికో కావడంతో ఓసారి ఆ ద్వీపానికి వెళ్లాను. నాకు అక్కడే డెలివరీ అయ్యింది. ఆ ప్రసవ సమయంలో తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు చేతిలోకి తీసుకొని తల్లిపాలతో ఆకలి తీర్చాను. అలా చేసినప్పుడు ఒక ఆలోచన తన మొదడుకు తట్టింది. ఇలా సమాజంలో ఎంతోమంది పసిబిడ్డలు అమ్మ పాలు అందక అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. వీరికి తన వంతు సహాయంగా పాలను డొనేట్ చేయడం ప్రారంభించింది. ఈమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ అనే హార్మోన్ వ్యాధి ఉంది. దీని కారణంగా ఆమెకు పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయట. తనలోని లోపాన్ని గుండెల్లో దాచుకొని సమాజానికి మంచి చేయాలనే సత్ ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రక్తం అందక మరణించడం కంటే కూడా తల్లి చనుపాలు లభించక చాలా మంది శిశువులు పసితనంలోనే చనిపోతున్నారు. కొందరు శరీరంలోని లోపాలతో అంగవైకల్యంగా మారుతున్నారు. వీటికి కారణం బిడ్డను జన్మనిచ్చి పొత్తిళ్లలోనే తల్లి చనిపోవడం. ఇలా చనిపోయిన వారి పసిపిల్లలకు అమ్మ పాలు దొరకడం చాలా కష్టం. అలాంటి వారికోసం ఈ మదర్ ఫీడ్ బ్యాంకులు వెలిశాయి. అందులో వెళ్ళి ఏతల్లి అయినా చనుపాలను దానం చేయవచ్చు. ఇలా ఇచ్చిన వాటిని ఫ్రీజర్లో భద్రపరిచి అవసరమైన వారికి అందజేస్తారు.

T.V.SRIKAR