Chat GPT, Arrange Marriages : పెళ్ళిళ్ళ పేరమ్మగా చాట్ జీపీటీ.. అడిగిన సంబంధాలు వెతికిస్తుంది !

గతంలో పెళ్ళిళ్ళు చేయాలంటే ... అటు ఏడు తరాలు... ఇటు ఏడు తరాలు... చూసుకొని సంబంధాలను కలుపుకునేవారు. ఈ సంబంధాలను తీసుకొచ్చే పెళ్ళిళ్ళ పేరయ్యలకు తృణమో ఫణమో ఇచ్చుకునేవారు. తర్వాత మ్యారేజ్ బ్రోకర్స్ (Marriage Brokers) ... ఆ తర్వాత మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ (Matrimony Websites) లోనే తమకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి ప్రొఫైల్స్ చూసుకొని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.

గతంలో పెళ్ళిళ్ళు చేయాలంటే … అటు ఏడు తరాలు… ఇటు ఏడు తరాలు… చూసుకొని సంబంధాలను కలుపుకునేవారు. ఈ సంబంధాలను తీసుకొచ్చే పెళ్ళిళ్ళ పేరయ్యలకు తృణమో ఫణమో ఇచ్చుకునేవారు. తర్వాత మ్యారేజ్ బ్రోకర్స్ (Marriage Brokers) … ఆ తర్వాత మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ (Matrimony Websites) లోనే తమకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి ప్రొఫైల్స్ చూసుకొని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. కానీ భవిష్యత్తులో ఈ ట్రెండ్ కూడా మారబోతోంది. చాట్ జీపీటీ (Chat GPT)ని ఉపయోగించుకుంటే… మన అభిరుచులకు తగిన సంబంధం వెతికిపెడుతుంది. అదెలా అనుకుంటున్నారు… ఓ రష్యన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన వినూత్న ఆలోచనను అమలు చేసి… చాట్ GPT చూపించిన ఓ అమ్మాయిని పెళ్ళి కూడా చేసుకున్నాడు.

అబ్బాయి లేదా అమ్మాయి… అన్ని విధాలా నచ్చే వరుడు, వధువును వెతకడం అనేది ఇప్పుడు చాలా కష్టంగా మారింది. అమ్మాయిలు తక్కువ అవడంతో అబ్బాయిలకు ఓ పట్టాన సంబంధాలు కుదరడం లేదు. దాంతో చాలా మంది పెళ్ళికాని ప్రసాద్ లు… ఇక మన లైఫ్ లో మ్యారేజీ యోగం లేదా అని బెంగ పెట్టుకుంటున్నారు. ప్రొఫైల్ తో సంబంధం లేదు… ఎవర్నో ఒకర్ని చేసుకుందాం… అని ఫిక్సయినా సరే… అమ్మాయిలు మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు. గుడ్ ప్రొఫైల్ ఉంటేనే ప్రియారిటీ ఇస్తున్నారు. అందుకే రష్యాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన పెళ్ళి కోసం… ఓ వినూత్న ఆలోచన చేశాడు.

రష్యా (Russia) సాఫ్ట్ వేర్ ఇంజినీరు (Software Engineer) పేరు అలగ్జాండర్ (Alexander) … వయస్సు 23 యేళ్ళు. ప్రపంచానికి చాట్ జీపీటీ గురించి తెలియక ముందే… అలాంటి సాఫ్ట్ వేర్ GPT3ని తయారు చేశాడు. దాన్ని ప్రముఖ డేటింగ్ యాప్ సైట్.. టిండర్ కు లింకేజ్ చేశాడు. తనకు సరిపడే అమ్మాయిల ప్రొఫైల్స్ వెతికి పెట్టే బాధ్యతను GPT3కి అప్పజెప్పాడు. జీపీటీ3 తో పాటు మరికొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్స్ ని కూడా ఈ పనికి ఉపయోగించాడు అలగ్జాండర్. జీపీటీతో నిత్యం చాట్ చేస్తూ… తన ఇష్టాలను షేర్ చేస్తూ ఉండేవాడు. తన మనస్వత్వానికి సరిగ్గా సరిపోయే అమ్మాయి వెతికిపెట్టేందుకు కొన్ని సజెషన్స్ కూడా GPT3కి అందించాడు. ప్రొఫైల్ లో అమ్మాయి కనీసం రెండు ఫోటోలైనా అప్ లోడ్ చేసి ఉండాలి. ఆమెకు దైవభక్తి ఉండాలి… ఇలాంటి సూచనలు కూడా ఇచ్చాడు.

అలెగ్జాండర్ అభిరుచులకు తగ్గట్టుగా… జీపీటీ, AI బాట్స్ కలసి… టిండర్, టీజీ అనే డేటింగ్ వెబ్ సైట్స్ పరిశీలించి… 5 వేలకు పైగా అమ్మాయిల ప్రొఫైళ్ళను వెతికి పెట్టాయి. ఇందులో చివరకు 12 మందిని ఫైనల్ చేశాయి. వీళ్ళతో డేటింగ్ వెళ్ళిన అలగ్జాండర్… కరీనా అనే అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడు. అయితే వధువును వెతకడానికి ఎంత టైమ్ పట్టిందో తెలుసా… ఒక ఏడాది టైమ్. ఎలాగైతేనేం తనకు తగ్గ అమ్మాయి కరీనాతో పెళ్ళి అలగ్జాండర్ కి పెళ్ళి జరిగింది. అయితే ఈ సంబంధం కోసం తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడినట్టు పెళ్ళికి ముందే కరీనాతో చెప్పాడు. సో… ఇక రాబోయే రోజుల్లో పెళ్ళి సంబంధాల కోసం పెళ్ళిళ్ళ పేరయ్యల చుట్టూ తిరగనక్కర్లేదు. ఛాట్ జీపీటీ రూపంలో మనకో పెళ్ళిళ్ళ పేరమ్మ దొరికినట్టే. అయితే సాఫ్ట్ వేర్ లో చాలా మంది ఉద్యోగాలను పోగొడుతున్న ఈ జీపీటీ… త్వరలో మన పెళ్ళిళ్ళ పేరయ్యలకు ఉపాధి లేకుండా చేస్తుందన్నమాట.