బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ పేరిట ఉండేది. అలీ 14 ఏళ్ల 51 రోజుల వయసులో లిస్ట్-ఏ క్రికెట్‌లోని అరంగేట్రం చేశాడు. తాజాగా వైభవ్ అలీ రికార్డును బద్దలు కొట్టాడు. వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్‌తో పాటు రంజీల్లో మరియు అండర్-19 స్థాయిలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారత క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు. కాగా వైభవ్ లిస్ట్ ఏ అరంగేట్రంలో నిరాశపరిచాడు. సాగలేదు. తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్ ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు.