వైభవ్ సూర్యవంశీ మెరుపులు, ఫైనల్లో యువభారత్

అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. సెమీస్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 13 ఏళ్ళ బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు.

  • Written By:
  • Publish Date - December 6, 2024 / 08:44 PM IST

అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. సెమీస్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 13 ఏళ్ళ బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. తొలి రెండు మ్యాచ్ లలో నిరాశపరిచిన సూర్యవంశీ సెమీస్ లో విధ్వంసం సృష్టించాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. తర్వాత ల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యంగ్‌ ఇండియా.. వైభవ్‌ సూర్యవంశీ మెరుపులతో 21.4 ఓవర్లలో దానిని అందుకుంది. వైభవ్ 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 రన్స్ చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో వైభవ్‌ సూర్యవంశీని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ 1.1 కోట్లకు చేసింది.