VANGA GEETHA: ఏపీలో పార్టీలన్నీ ప్రచారం స్పీడ్ పెంచాయ్. సభలు, సమావేశాలు, సమీక్షలు.. ఎక్కడ చూసినా రాజకీయమే కనిపిస్తోంది. ఐతే ఇప్పుడు ఏపీ దృష్టి అంతా పిఠాపురం నియోజకవర్గం మీదే కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే కారణం. పార్టీ పెట్టి పదేళ్లు అయినా.. పవన్ ఇంత వరకు చట్టసభల్లో అడుగు పెట్టలేదు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన సేనాని.. ఘోర పరాభవాన్ని మూట గట్టుకున్నారు.
ARVIND KEJRIWAL VS KAVITHA: కవిత VS కేజ్రీవాల్.. వన్ టు వన్‌కు సిద్ధమవుతున్న ఈడీ
ఐతే ఈసారి పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఇక అటు పవన్‌కు షాక్ ఇచ్చేందుకు వైసీపీ కూడా తగ్గేదే లే అంటోంది. కాకినాడ ఎంపీ వంగా గీతను అభ్యర్థిగా అనౌన్స్ చేసిన జగన్.. పిఠాపురం బాధ్యతలను మిథున్‌రెడ్డికి అప్పగించారు. దీంతో పిఠాపురం రాజకీయం హాట్‌హాట్‌గా కనిపిస్తోంది. అక్కడ ఏ చిన్న విషయం జరిగినా.. రాష్ట్రం అంతా చర్చకు దారి తీస్తోంది. వైసీపీ అభ్యర్థిని వంగా గీతకు పిఠాపురంలో షాక్ తగిలింది. ఆమె ప్రచారాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ అడ్డుకున్నారు. ప్రత్యర్థిగా పవన్ బరిలో ఉండటంతో.. వంగా గీత ముందుగానే అలర్ట్ అయ్యారు. నియోజకవర్గంలో వారంరోజులుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
యథావిధిగా ఆమె పిఠాపురం పట్టణంలోని 2,3,4 మున్సిపల్ వార్డుల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎన్నికల ప్రచారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. అనుమతి పత్రాలు ఉంటే చూపించాలని కోరారు. అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వంగా గీత అనుచరులు ప్రచారం ఆపేసి.. అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కారణం అవుతోంది.