ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారం అని… ఎన్నికల ముందు తెగ బిల్డప్ ఇచ్చిన వేణుస్వామి.. ఫలితాలు రివర్స్ అయ్యే సరికి యూటర్న్ తీసుకున్నారు. వైసీపీ ఓటమి తర్వాత.. అంతా కలిసి ఆడుకోవడంతో.. ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక సెలబ్రిటీల జాతకాల జోలికి వెళ్లనని.. అలాంటి జోతిష్యాలు చెప్పను.. అయిందేదో అయింది ఇక సెలవు అన్నట్లు.. ఎక్కడలేని బాధను మొహానికి అంటించుకొని మరీ ఆ వీడియోలో వివరణ ఇచ్చాడు వేణుస్వామి. పీడ వదిలింది అని ఓ వర్గం అనకుంటున్న సమయంలో.. వేణుస్వామి మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. సెలబ్రిటీ జాతకం బయటపెట్టాడు. అప్పట్లో చైతూ, సమంత విడిపోతారని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసిన వేణుస్వామికి.. ఇన్నాళ్లకు మళ్లీ ఓ మంచి స్టఫ్ దొరికింది. అదే నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం. మాములుగానే మనోడి పబ్లిసిటీ పీక్స్ ఉంటది.. ఇంకా ఇలాంచి చాన్స్ వదులుకుంటారా… అదే జరిగింది కూడా ! చైతూ, శోభిత అలా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారో లేదో.. ఇలా ఓ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. వీళ్లద్దరి భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్తానని.. టైమ్ రాసిపెట్టుకోండి అన్నట్లుగా ఓ ప్రకటన చేశాడు. చెప్పినట్లుగానే సోషల్ మీడియా టింగ్‌న ప్రత్యక్షం అయ్యాడు. తన పాండిత్యంతో బోర్డుపై లెక్కలు వేస్తూ.. ఏతావాతా తేల్చింది ఏంటి అంటే.. శోభిత కంటే సమంత బెస్ట్ అని.. నాగచైతన్య, శోభిత కూడా నిలవదని… 2027 తర్వాత ఇద్దరూ విడిపోతారని చెప్పాడు. అది కూడా ఒక స్త్రీ వల్ల ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడతాయని అన్నాడు. నాగచైతన్య మొదటి పెళ్లికి నూటికి 50 మార్కులు వేస్తానని… ఇప్పుడు జరగబోయే పెళ్లికి మాత్రం నూటికి 10మార్కులే ఇవ్వగలనని తేల్చి చెప్పాడు. నాగచైతన్య, శోభిత జాతకాల్లో దోషాలు ఉన్నాయని.. భవిష్యత్తులో ఎలాంటి అనర్థాలు జరగకుండా ముందుగానే శాంతి చేయించుకుంటే మంచిది అనే సలహా ఇచ్చాడు. లాస్ట్‌లో ట్విస్ట్ ఏంటంటే.. తను చెప్పిన జాతకం అబద్ధం కావాలని కోరుకుంటున్నానని.. సెంటిమెంట్ డైలాగ్ ఒకటి విసిరాడు వేణుస్వామి. అక్కడితో ఆగాడా అంటే.. సోషల్ మీడియాలో మేధావులు తనపై రెచ్చిపోయి కామెంట్లు చేయొచ్చని,.. అందులో క్రియేటివిటీ చూపించండి చెప్పుకొచ్చాడు వేణుస్వామి. ఇవే ఇప్పుడు హైలైట్ అవుతున్నాయ్. నువ్ ఏమైనా చెప్పుకో.. ఎవరి జాతకాలు అయినా చెప్పుకో.. కానీ ఇక సెలబ్రిటీల జోలికి వెళ్లను అని.. వాళ్ల జాతకాలు బహిరంగంగా చెప్పను అని బిల్డప్ ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ యూటర్న్ ఎందుకు తీసుకున్నావ్ స్వామీ అంటూ.. నిలదీస్తున్నారు వేణుస్వామి. ఐనా వేణుస్వామిని నమ్మడం అంటే.. అమ్ముకోవడమే అని మరికొందరు గుస్సా అవుతున్నారు. తెలంగాణ, ఏపీ ఎన్నికల ఫలితాలపై వేణుస్వామి మాటలు నమ్మి బెట్టింగ్‌లు పెట్టి.. లక్షలు, కోట్లలో నష్టపోయిన వాళ్లు ఉన్నారు. ఈయన ఎప్పుడు దొరుకుతాడా అని వాళ్లంతా వెతుకులాట కూడా మొదలుపెట్టారు ఆ మధ్య టాక్ వినిపించింది. తెలంగాణలో కేసీఆర్‌దే అధికారం అన్నాడు.. జరగలేదు. ఏపీలో జగన్‌కు తిరుగులేదు అన్నాడు.. అదీ జరగలేదు. ప్రభాస్ లైఫ్ అయిపోయింది అన్నాడు.. చూస్తే హిట్‌ల మీద హిట్‌లు కొడుతున్నారు. తనను తాను గొప్ప జోతిష్యుడిగా చెప్పుకునే వేణుస్వామి.. పబ్లిసిటీ కోసం, తన యాక్టివిటీని పెంచుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అంటూ.. మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.