చాలా మంది ప్రస్తుతం నడుస్తుంది కలియుగం అని అనుకుంటు ఉంటారు. కానీ ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా యుగం.. ఈ యుగానికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అదే పరిస్థితిని సూచిస్తుంది.
రోహిణి ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. ప్రెజంట్ సీరియల్స్ లోను, సినిమాల్లోనూ చేస్తూ బిజీ నటిగా మారింది. తాజాగా తన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఉంది. డ్రగ్స్ తీసుకుందనే అనుమానంతో పోలీసులు ఆమెని స్టేషన్ కి తీసుకొస్తారు. నాకేం సంబంధం లేదు సార్. బర్త్ డే పార్టీ ఉందని చెప్తే వచ్చాను అని రోహిణి వాదిస్తు ఉంది. దాంతో అక్కడే ఉన్న ఒక మీడియా ప్రతినిధి నీకు పాజిటివ్ వచ్చిందంట కదా అని అడిగాడు.నాకు అసలు టెస్ట్ లే చెయ్యలేదు. పాజిటివ్ ఎలా వస్తుంది. ఎన్ఆర్ఐ లు పిలిస్తే పార్టీలకి రాకూడదు అంటు ఏడుస్తుంది.
ఇక ఆ వీడియోని చూస్తుంటే మాత్రం ఏదైనా సినిమాకి సంబంధినదని అనిపిస్తుంది. ఎందుకంటే మీడియా ప్రతినిదుల మైక్ కి ఎలాంటి ఛానల్ సింబల్ లేదు. పైగా తాజాగా డ్రగ్స్ కి సంబంధించిన ఎలాంటి వార్త లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రమోషనల్ వీడియోనే అని అంటున్నారు. కాకపోతే ఎవరయితే వీడియోని అప్ లోడ్ చేసారో వాళ్ళు ప్రమోషన్స్ అని చివరలో అయినా చెప్పాల్సింది. ఇటీవల నటి హేమ డ్రగ్స్ కేసులో పెట్టుబడి కొన్ని రోజులు జైల్లో కూడా ఉంది. దాంతో రోహిణి న్యూస్ సోషల్ మీడియాలో కనపడగానే వైరల్ అవుతుంది. ఆ వీడియో ని చూస్తుంటే రేవ్ పార్టీ వీడియోని పోలినట్టుగా ఉంది