HMDA VIGILANCE: అవినీతిపై విజిలెన్స్.. అడ్డగోలు పర్మిషన్లకు చెక్.. విజిలెన్స్ ఎంక్వైరీతో అధికారుల్లో దడ

HMDAలో డైరెక్టర్ల అవినీతే లక్ష్యంగా సోదాలు చేశారు విజిలెన్స్ అధికారులు. గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులపై ఆరా తీశారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్‌తో పాటు వెంచర్లకు గత 9యేళ్ళుగా అనుమతులు ఇచ్చిన ఫైళ్ళను పరిశీలించారు.

  • Written By:
  • Updated On - February 28, 2024 / 06:29 PM IST

HMDA VIGILANCE: తెలంగాణలో అవినీతి అధికారుల బండారం బయటపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో అందినంత దోచుకున్న అధికారులను గుట్టును బయటపెడుతున్నారు విజిలెన్స్ అధికారులు. HMDA ఆఫీసులో జరిపిన తనిఖీల్లో ఏకంగా 51 ఫైళ్ళను మాయం చేసినట్టు తేలింది. హైదరాబాద్ మైత్రి వనంలోని ఫోర్త్ ఫ్లోర్‌లో ఉన్న HMDA ఆపీసులో ఉదయం ఏడింటి నుంచి విజిలెన్స్ సోదాలు చేసింది. ఒకేసారి 50 మంది అధికారులు ఇందులో పాల్గొన్నారు.

Vangaveeti Radha Krishna: వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్‌.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం.. ఆఫర్ ఏంటంటే..

HMDAలో డైరెక్టర్ల అవినీతే లక్ష్యంగా సోదాలు చేశారు విజిలెన్స్ అధికారులు. గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులపై ఆరా తీశారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్‌తో పాటు వెంచర్లకు గత 9యేళ్ళుగా అనుమతులు ఇచ్చిన ఫైళ్ళను పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు, కోడ్ అమల్లో ఉన్న టైమ్‌లో కూడా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినట్టు HMDA అధికారులపై ఆరోపణలున్నాయి. వాటిపైనా విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. సోదాలు చేపట్టిన విజిలెన్స్ నిఘా టీం అరెస్ట్ వారెంట్‌తో వెళ్లింది. HMDAలో ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, విద్యాధర్.. గతంలో పర్మిషన్ ఇచ్చిన ఫైల్స్ పరిశీలించారు. ఇప్పటికే మాజీ డైరక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నడుస్తోంది. డైరెక్టర్ హోదాలో బాలకృష్ణ 2 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారు. దాంతో మిగతా డైరెక్టర్లపైనా నిఘా పెట్టింది విజిలెన్స్. HMDAలో విజిలెన్స్ ఎంక్వైరీలో కొందరు అధికారుల అవినీతి బట్టబయలు అయింది. 51 బిల్డింగ్ అనుమతులకు సంబంధించి మాన్యువల్ ఫైల్స్ మాయం అయినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆఫీసులోని నాలుగు, ఐదు అంతస్తుల్లో ఉన్న రికార్డ్ సెక్షన్ నుంచి ఈ ఫైల్స్ మాయం అయినట్టు గుర్తించారు. బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన కీలక ఫైల్స్ మాయం అయ్యాయి.

వీటిల్లో ఏ అధికారులకు ప్రమేయం ఉంది.. ఏ ప్రజాప్రతినిధి చెబితే వాటిని బయటకు తరలించారో ఎంక్వైరీ మొదలుపెట్టారు విజిలెన్స్ అధికారులు. HMDA తర్వాత.. GHMC, టౌన్ ప్లానింగ్ DTPC ఆఫీసుల్లోనూ విజిలెన్స్ దాడులు కొనసాగే అవకాశాలున్నాయి. ఈమధ్య HMDA రివ్యూ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే 15 రోజుల్లో విజిలెన్స్ సోదాలు జరుగుతాయన్నారు. అవినీతి అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. అక్రమ లే అవుట్, బిల్డింగ్ అనుమతులపైనా దర్యాప్తు జరుగుతోంది. అడ్డుగోలు అనుమతులతో కోట్ల రూపాయలు కూడబెట్టుకున్న అధికారులందర్నీ ఏరేసే పనిలో ఉంది ప్రభుత్వం.