Vijayashanthi: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్‌కు ట్విటర్‌లో వరుస పంచులు ఇస్తున్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. ఎన్నికల ఫలితాలు మొదలు.. ప్రతీ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మరోసారి ట్విటర్ వేదికగా కేసీఆర్ పరువు తీశారు. పని దినాలను సెలవు దినాలుగా.. సెలవు దినాలను కూడా సెలవులుగా పని చేసిన ప్రభుత్వం కేసీఆర్‌ది.
Pawan’s Wife : అనాథ పిల్లలతో పవన్ భార్య క్రిస్మస్ వేడుకలు..
పని దినాలను ప్రజలకోసం పని చేసే దినాలుగా.. సెలవు దినాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉండే దినాలుగా మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ట్వీట్ చేశారు. రీసెంట్‌గా అధికారులకు డ్యూటీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు 18 గంటలు సర్వీస్ చేసే అధికారులు మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగాలంటూ చెప్పారు. అంత సర్వీస్ ఇవ్వలేం అనుకునేవాళ్లు వెంటనే రాజీనామాలు చేయొచ్చంటూ సింపుల్‌గా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే విషయంలో కేసీఆర్‌ను, రేవంత్ రెడ్డిని పోలుస్తూ కౌంటర్ ఇచ్చారు విజయశాంతి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్‌కు వచ్చేవారు కాదు. అన్ని పనులు ప్రగతి భవన్ నుంచే జరిగేవి. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా పెద్దగా కలిసేవాళ్లు కాదు. ఏకపక్ష నిర్ణయాలు మాత్రమే తీసుకునేవాళ్లు. ఇవే అప్పటి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా సెక్రటేరియట్‌కే వచ్చారు.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ మంత్రులంతా రోజూ సెక్రటేరియట్‌కు వస్తున్నారు. అధికారులు కూడా పని గంటలు పెంచి ఎక్కవ సర్వీస్ చేయాలంటూ సీఎం రేవంత్ వాళ్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రతీ విషయంలో బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసే విజయశాంతి.. ఈ విషయంలో కూడా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అధికార ప్రతిపక్ష కార్యకర్తలు పోటాపోటీగా కామెంట్లు పెడుతున్నారు.