ముంచుకొస్తున్న గండం.. ఈ రాత్రి గడిస్తేనే బెజవాడకు బతుకు..

ఆకాశానికి చిల్లు పడిందా.. వరుణుడు పగబట్టాడా అనే స్థాయిలో విజయవాడను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయ్. చినుకులుగా మొదలై, జడివానగా మారి.. కుండపోతగా వాన కురుస్తోంది. విజయవాడలో 30ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజే 29సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

  • Written By:
  • Publish Date - September 2, 2024 / 02:24 PM IST

ఆకాశానికి చిల్లు పడిందా.. వరుణుడు పగబట్టాడా అనే స్థాయిలో విజయవాడను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయ్. చినుకులుగా మొదలై, జడివానగా మారి.. కుండపోతగా వాన కురుస్తోంది. విజయవాడలో 30ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజే 29సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ఇళ్లు మునిగిపోయాయ్‌. కాలనీలు అన్నీ చెత్త, చెదారంతో నిండిపోయాయ్‌. రోడ్లు, పొలాలు చెరువులను తలపిస్తున్నాయ్‌. ఏ చెరువు గట్టు ఎప్పుడు తెగుతుందో.. ఏ కాలువకు ఎక్కడ గండి పడుతుందో… ఏ వాగు ఏ స్థాయిలో ముంచుకొస్తుందోననే భయం బెజవాడవాసులను గజగజలాడిస్తోంది.

ఇంత భయంలో.. మరో ప్రమాదం విజయవాడను వణికిస్తోంది. మరో గండం ముంచుకురాబోతోంది. ఈ రాత్రికి బతికితేనే బతికినట్లు.. లేదంటే విజయవాడ వరదలో కొట్టుకుపోవడం ఖాయం అనే భయాలు వినిపిస్తున్నాయ్. విజయవాడకు అమావాస్య గండం వచ్చింది పడింది. అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద కనిపిస్తోంది. పోటు మీదుంటే… వరదని తనలోకి సముద్రం ఇముడ్చుకోలేదు.

వరద జలాలు సముద్రంలో కలవకుంటే… ముంపు భయం పెరగనుందని సమాచారం. ఎగువ నుంచి భారీ వరద.. దిగువన సముద్ర పోటుతో ఏం జరుగుతుందోనని బెజవాడ జనాలు భయపడుతున్నారు. రాత్రి 12 గంటల తర్వాత.. అమావాస్య గడియలు ముగిశాకే సాధారణ స్థితికి రానుంది సముద్రం. ఐతే అమావాస్య గండంతో భయపడాల్సిన అవసరం లేదని అధికారులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ప్రకారం వరద తగ్గుముఖం పట్టకుంటే నిజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా మారే సూచనలు ఖాయం.