కోహ్లీ @ 27000 రన్ మెషీన్ మరో రికార్డ్

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో రన్ మెషీన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీనే... సచిన్ టెండూల్కర్ శకం తర్వాత వరల్డ్ క్రికెట్ ను రూల్ చేస్తున్న విరాట్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాడు.

  • Written By:
  • Publish Date - September 30, 2024 / 06:34 PM IST

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో రన్ మెషీన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీనే… సచిన్ టెండూల్కర్ శకం తర్వాత వరల్డ్ క్రికెట్ ను రూల్ చేస్తున్న విరాట్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్ అయినా , వన్డే అయినా , టీ ట్వంటీ అయినా… ఫార్మాట్ తో సంబంధం లేదు… కోహ్లీ క్రీజులో అడుగుపెట్టాడంటూ రికార్డులు వెంట రావాల్సిందే… పరుగుల వరద పారాల్సిందే… తాజాగా కాన్పూర్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యంత వేగంగా 27 వేల పరుగుల మైలురాయి అందుకున్న క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ 594 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయి చేరుకున్నాడు.

గతంలో ఈ వరల్డ్ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉండేది. సచిన్ 623 ఇన్నింగ్స్‌ల‌లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీని కోసం సచిన్ 226 టెస్టు, 396 వన్డే, ఒక టీ20 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. కోహ్లీ 115 టెస్ట్ ఇన్నింగ్స్ లు, 295 వన్డే, 125 టీ ట్వంటీ ఇన్నింగ్స్ లలో 27 వేల రన్స్ సాధించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన విరాట్ ఇప్పటి వరకూ టెస్టుల్లో 8 వేలకు పైగా, వన్డేల్లో 13 వేలకు పైగా, టీ ట్వంటీల్లో 4 వేలకు పైగా పరుగులు చేశాడు.