ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఎన్నికల పోరు దాదాపు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరో తొమ్మిది రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది ఏ పార్టీనో తేలబోతోంది. పోలింగ్‌కు ఇంకా సమయం ఉన్నా కానీ తెలంగాణలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి ఓట్ పోలయ్యింది. ఖైరతాబాద్‌కు చెందిన చెంచుల అన్నపూర్ణ అనే వృద్ధురాలు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తాను ఎంచుకున్న పార్టీకి ఓటు వేశారు. ఈ సంవత్సరం వృద్ధులకు, దివ్యాంగులకు, జర్నలిస్ట్‌లకు ఇంటి నుంచి ఓట్ వేసే.. ఓట్ ఫ్రం హోం విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 30న పోలింగ్ జరగబోతోంది.
PM Kisan Samman Nidhi: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన భారీగా పెంపు..
ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం.. ఇంటి నుంచి ఓట్ వేసేవాళ్లు నవంబర్ 21 నుంచి 27 వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళే పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఖైరతాబాద్‌కు చెందిన చెంచుల అన్నపూర్ణ అనే వృద్ధురాలు.. ఓట్ ఫ్రం హోం ద్వారా తన ఓటుహక్కును వినియోగించున్నారు. ఎన్నికల అధికారులు అన్నపూర్ణ ఇంటికి వెళ్లి వివరాలు తీసుకున్నారు. ఆవిడ బ్యాలెట్ పేపర్‌ను సేకరించారు. ఇవాళ్టి నుంచి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఓట్ ఫ్రం హోం ప్రారంభమైంది. రాష్ట్రంవ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓట్లు వేస్తున్నారు. ప్రతీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్‌లో పాల్గొనడం పెద్ద టాస్క్‌గా ఉండేది. వీళ్లను పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలంటే ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే.
అలా లేని వాళ్లు చాలా మంది ఓట్లు వేసేవాళ్లు కాదు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. భారత ఎన్నికల చరిత్రలో ఇంటి నుంచే ఓట్ వేయడం ఇదే తొలిసారి. వారం రోజుల పాటు ఈ ఓట్ ఫ్రం హోం ప్రక్రియ కొనసాగబోతోంది. ఆ తరువాత నవంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగనుంది.