ఒడిలో బిడ్డతో లారీని వెంబడించిన వీఆర్వో శివంగికి హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు..

ఆడపిల్ల అనుకోవాలే కానీ.. దేవుడు కూడా దిగివస్తాడు భూమ్మీదకు ! అంత పట్టుదల వారి సొంతం. కష్టాలను, కన్నీళ్లను చూసినోళ్లకు.. వాటిలోనే బతికినోళ్లను తక్కువగా చూడడం అంటే.. మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే. మగువ పవర్ ఏంటో.. అనుకుంటే ఏం సాధిస్తుందో.. కృష్ణా జిల్లాలో జరిగిన ఘటనతో మరోసారి ప్రూవ్ అయింది.

  • Written By:
  • Publish Date - June 12, 2023 / 01:34 PM IST

ఒడిలో చంటి బిడ్డ.. స్కూటీపై ఛేజింగ్.. లారీని శివంగిలా వెంటాడి పట్టుకున్నారో మహిళా అధికారి. ఆమె ధైర్యానికి ఇంటర్నెట్ సలాం చేస్తోంది. నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. పసిబిడ్డను పొట్టకి అంటిపెట్టుకున్న కృష్ణా జిల్లా పామర్రు వీఆర్వో మీనా ఫొటోలు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె సాహసానికి నెటిజన్లు హ్యట్సాఫ్ అంటున్నారు. పామర్రు మండలం పసుమర్రు సమీపంలో.. కొంతకాలంగా అనుమతులు లేకుండా మట్టి దిబ్బల నుంచి మట్టిని తవ్వి లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం వచ్చింది. వెంటనే వీఆర్వో మీనాకు విషయం తెలిసింది.. ఆమెకు 10 నెలల బిడ్డ చేతుల్లో ఉన్నాడు. అయినా సరే ఆమె తన బిడ్డను ఎత్తుకుని లారీని అడ్డుకోవడానికి వీఆర్వో మీనా తన పసిబిడ్డను తీసుకుని స్కూటీపై బయల్దేరి వెళ్లారు.

వీఆర్వో మీనా కొత్తూరులో రెండు వాహనాలను సీజ్ చేశారు.. వారికి జరిమానా కూడా విధించారు. మైనింగ్ మాఫియాను ఎంతో ధైర్యంగా అడ్డుకున్న ప్రశంసల వర్షం కురుస్తోంది. విధి నిర్వహణ విషయంలో ఆమెకు ఉన్న ధైర్యం, నిబద్ధతకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వీఆర్వో మీనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తనతో పాటూ చంటి బిడ్డతోనే ఆమె మట్టి మాఫియాను అడ్డుకున్న తీరును పొగిడేస్తున్నారు. ఇప్పుడు మీనా ఓ సెలబ్రిటీ అయ్యారు.. ఆ మహిళా అధికారి ధైర్య సాహసాలకు అందరూ ఫిదా అవుతున్నారు.