ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. 2011 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వేడ్ ఆసీస్ తరపున 36 టెస్టులు, 97 వన్డేలు, 92 టీ ట్వంటీలు ఆడాడు. చివరిసారిగా ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్ ను తాను ఎంతగానో ఆస్వాదించానని, రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు వేడ్ చెప్పాడు. దీనిపై గత కొన్ని నెలలుగా ఆసీస్ సెలక్టర్లతో తాను చర్చించినట్టు చెప్పాడు. ఇకపై జాతీయ జట్టు కోచింగ్ లో భాగం కావాలనుకుంటున్నట్టు వేడ్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్ లో ఆడనున్న మాథ్యూ వేడ్ కోచింగ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ టెస్టుల్లో 1613 , వన్డేల్లో 1827 , టీ ట్వంటీల్లో 1202 పరుగులు చేశాడు.