Jr. NTR: జూనియర్ వార్ 2 కి రంగం రెడీ అయిందా?

వార్2 షూటింగ్ కి మూహూర్తం ఫిక్స్ అయిందా?. టోటల్ స్క్రిప్ట్‌ వర్క్ క్లైమాక్స్ కి చేరిందా? .డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సడన్ గా హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలవడానికి రీజన్ ఎంటీ అనిచర్చనడుస్తోంది.

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 08:04 AM IST

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కన్ఫర్మ్‌ అయింది. వార్ 2 తో నార్త్ బాట పట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ని సెట్స్ లో కలిసాడు వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఫైనల్‌ స్క్రిప్ట్‌ గురించి వివరించడంతో పాటు తారక్ పాత్రకు సంబంధించిన ఇన్ ఫుట్స్ ని అందించాడు. షూటింగ్ షెడ్యూల్స్ తో పాటు రిలీజ్ డేట్ పై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.మొత్తానికి ఈ భేటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సహాన్ని నింపారు. వార్2 కంటే ముందే ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు నార్త్ మీడియా కోడౌ కుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ 3 లో ఎన్టీఆర్ అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టైగర్ 3 ని యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. వార్ 2 ని కూడా ఇదే సంస్థ నిర్మించబోతుంది. అందుకే వార్ 2 లో ఎన్టీఆర్ పాత్రని టైగర్3 లో ఇంటర్ డ్యూస్ చేయలని డిసైడ్ అయ్యారట. త్వరలో దినిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్‌ స్థాయి పాన్ ఇండియా రేంజ్ ని దాటి పోయింది.వార్2 తో ఆ క్రేజ్ పాన్ వరల్డ్ కి చేరేలా కనిపిస్తోంది.