వార్నర్ కు షాక్, ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

ఐపీఎల్ మెగావేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.ఈ వేలం పాటలో అతను అమ్ముడుపోలేదు.

  • Written By:
  • Publish Date - November 26, 2024 / 04:34 PM IST

ఐపీఎల్ మెగావేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.ఈ వేలం పాటలో అతను అమ్ముడుపోలేదు. టీ20 ఫార్మట్‌లో టన్నలు కొద్దీ పరుగులు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్‌ను తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు. 2009లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తరువాత 2024 సీజన్ వరకూ కొనసాగుతూ వచ్చాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో 6,565 రన్స్ చేయగా.. దీనిలో 4 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపిన వార్నర్ కు ఆ తర్వాత సీజన్ నుంచి గడ్డకాలం మొదలైంది. ఆ తర్వాత సన్ రైజర్స్ విడిచిపెట్టడం, ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడినా స్థాయికి తగినట్టు రాణించలేదు. ఈ కారణంగానే ఇప్పుడు వేలంలో అమ్ముడుకాలేదు.