CID Officers: చంద్రబాబు అరెస్ట్ కి రెండేళ్ల క్రితమే రంగం సిద్దమైందా..? అయితే ఎందుకు జాప్యం జరిగింది..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రదాన కార్యదర్శి నారా చంద్రబాబు అరెస్ట్ వెనుక జరిగిన గ్రౌండ్ వర్క్ ఇదే.

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 08:16 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఈరోజు సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి కారణం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో భారీ స్కామ్ కి తెరలేపినట్లు చెబుతున్నారు. అయితే ఈ స్కామ్ బాబు అధికారంలో ఉన్నప్పుడే 2018 లో జరిగినట్లు తెలిసింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రెండేళ్ల క్రితమే బాబుకు తెలుసా..?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తాను అరెస్ట్ అవుతానన్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసన్నది విశ్లేషకుల వాదన. దీనికి కారణం అప్పట్లో డీఐజీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ కౌన్సిల్ టాక్స్ డీవియేషన్లో వచ్చిన అవకతవకల్లో భాగంగా ఈ విషయాన్ని గుర్తించింది. స్కిల్లీ సంస్థ పేరుతో జరుగుతున్న లావాదేవీల గురించి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. దీనిని చూసిన చంద్రబాబు దీనిపై విచారణ జరుపకుండా పక్కన పడేశారు. దీనిపై 2019లోనే చంద్రబాబు హుషారయ్యారు. ఇది అటు ఇటూ వెళ్లి ఇక్కడికే వచ్చిందే అన్న అలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే గతంలో తన పాలనలో బీజేపీ నుంచి ఉపద్రవం వచ్చి పడుతుందని భావించారు. అందుకే సీబీఐని రాష్ట్రంపై వేసి తన పై కక్ష్య సాధింపుకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నారని గగ్గోలుపెట్టారు. దీనికి బీజం అప్పుడే పడింది అని చెప్పేందుకు ఈ సంఘటనే ప్రత్యేక ఉదాహరణ. అదే సమయంలో వైఎస్ జగన్ ప్రతి పక్షంలో ఉండటంతో అస్సలు పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. అయితే ఈ ముప్పు రాష్ట్ర ప్రభుత్వం నుంచే వస్తుందని ఊహించలేక పోయారు. అందులోనూ సీఐడీ ఇంతగా పనిచేస్తుందని గుర్తించని బాబు కొంత కాలం ప్రశాంతంగా ఉన్నారు.

అరెస్ట్ లో జాప్యం ఇందుకేనా..

కేంద్ర ప్రభుత్వం ద్వారా తన అరెస్ట వస్తుందని భావించిన చంద్రబాబుకు రాష్ట్రప్రభుత్వం ద్వారా ముప్పు పొంచి ఉందని గత వారం పది రోజుల నుంచి అక్కడక్కడా మాట్లాడటం చూస్తున్నాం. దీనికి కారణం సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. తద్వారా అరెస్ట్ తప్పదని భావించినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. పైగా ప్రస్తుతం సీఐడీ లో పనిచేసే ముఖ్య అధికారి రాజకీయ పార్టీలకు కొమ్ముకాయకుండా నిబద్దతతో కూడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఇంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరం అని భావించారు. అందులో భాగంగానే నిధులు ఎలా మళ్ళించారు. ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. అసలు ఈ షల్ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ లో 90శాతం నిధులు ఇస్తామన్న కంపెనీల భాగోతం మొత్తాన్ని బయటపెట్టేందుకు నిర్విరామంగా పనిచేశాయి. ఈ కంపెనీల యాజమాన్యాలను కోర్టులో ప్రవేశ పెట్టారు. అక్కడ వాళ్లు తమకు ఎలాంటి సంబంధం లేదని వాగ్మూలాన్ని తీసుకున్నారు. ఆతరువాతే చంద్రబాబు అరెస్ట్ కి రంగం సిద్దం చేశారు. అది కూడా కేవలం విచారణ నిమిత్తమే సిట్ ఆఫీసుకు తరలించారు. ఈ దర్యాప్తులో మరిన్ని కీలక వివరాలు వెలువడాల్సి ఉంది.

చంద్రబాబు మౌనం వెనుక అర్థమేంటి..

ఇంత తతంగం జరుగుతుంటే చంద్రబాబు సైలెంట్గా ఉండిపోయారే తప్ప ఏమీ మాట్లాడలేదు. పైగా అప్పుడప్పుడూ నన్ను ఉరి తీయండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం ఆయనలో భయం మొదలైపోయింది. తప్పుచేశాననే ఆందోళన ఉంది. లేకుంటే సీబీఐ లాంటి అధికారులు, సిట్ అధికారులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులను గతంలో ఎలా మాట్లాడేవారో ఒక్కసారి గుర్తుకు చేసుకోవాలి. తాజాగా నేటి సీబీఐ అధికారులతో ప్రవర్తించిన తీరుతో పోల్చుకుంటే విషయం అర్థమైపోతుంది. గతంలో తప్పు చేయనప్పుడు నిలదీసిన చంద్రబాబు నేడు తప్పు చేశాడు కాబట్టే మౌనంగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనపై కోర్టులు తీర్పులు వెలువరించాల్సి ఉంది.

స్కిల్ డెవలప్మెంట్ లో ఉద్యోగాలు ఎక్కడ..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అంటే యువతకు తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం. అయితే తెలుగుదేశం తన పాలనలో 2.50 లక్షల మందికి నైపుణ్య తరగతులను నిర్వహించి దాదాపు 50వేల ఉద్యోగాలను కల్పించామని చెబుతున్నారు. అయితే వీరి వివరాలను ఎక్కడా వెల్లడించడం లేదు. ఇందులో శిక్షణ తీసుకున్న వారు ఏ యూనివర్సిటీ లో చదివారు, ఏ ప్రాంతం వారు, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు అనే బేసిక్ వివరాలు వెల్లడించలేదు. పైగా అలాంటి వారు ఈరోజు ఎక్కడా బయటకు వచ్చి మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ధిపొందామని చెప్పనూ లేదు. దీంతో వీరు చేసింది పూర్తిగా బోగస్ అని తేలిపోయిందంటున్నారు రాజకీయ నిపుణులు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఉందని కొన్ని రాజకీయ పార్టీలు నిలదీస్తున్నాయి.

కేంద్రం నుంచి వస్తుందన్న ఇబ్బంది రాష్ట్రం నుంచే రావడంతో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. అయితే అరెస్ట్ తరువాత రిమాండ్ కు జైలుకు తరలిస్తారా.. లేక బెయిల్ మంజూరు చేస్తారా అన్న విషయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

T.V.SRIKAR