నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) కు కృష్ణమ్మ (Krishnamma) పరవళ్లు తొక్కుతు.. సాగర్ లో జలకళ సంతరించుకుంది. శ్రీశైలం జలాశయానికి (Srisailam reservoir) వరద కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం (Sri Sailam) పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883.8 అడుగులకు చేరింది. పూర్తి నీటి సామర్థ్యం 215.81గా ఉండగా… ప్రస్తుతం 208.72గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి (Power generation) కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3,09,600 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 5,18,539 క్యూసెక్కులుగా ఉంది.
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కురవడంతో.. ఆ వరద నీరంతా జూరాల (Jourala) .. సుంకేసుల (Sunkesula) నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జలాశయం ఆనకట్ట నుంచి 10 గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 18 అడుగుల మేర ఎత్తి దిగువ సాగరకు 4,31,370 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 3.36 లక్షల క్యూసెక్కుల వరద సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 546 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 198 టీఎంసీల నీరుంది. ఎగువనుంచి వస్తున్న వరద నీరు ఇవాళ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రస్ట్ గేట్లను తాకింది. దీంతో సాగర్ కూడా త్వరలోనే నిండిపోనుంది.
నాగార్జునసాగర్ జలాశయంలోకి వరదనీరు భారీగా చేరుతుండటంతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎడమకాల్వ నుంచి నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.