హైదరాబాద్ మహానగరానికి 24 గంటల పాటు తాగునీరు సరఫరా బంద్..
విశ్వనగర హైదరాబాద్ కు 4 నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ కు నీటి సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్‌లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతు పనులు చేస్తున్నారు. దీంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు 5వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని, 24 గంటల పాటు పలు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. హైదర్‌నగర్, షేక్‌పేట, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్, మూసాపేట, నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్‌పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో పూర్తిగా నీటి అంతరాయం ఉంటుందన్నారు.
పాక్షికంగా నీటి సరఫరా అంతరాయం..
భోజగుట్ట రిజర్వాయర్, బంజారా, ఎర్రగడ్డ, హైదర్ నగర్, కేపీహెచ్‌బీ వంటి ప్రాంతాల్లో ఓ అండ్ ఎం డివిజన్ -3 లోని బల్క్ కనెక్షన్లకు పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుందని అధికారుల చెప్పారు.