బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ రికార్డుల్లో మనదే హవా

దాదాపు 7 వారాల సుధీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది.

  • Written By:
  • Publish Date - September 15, 2024 / 03:53 PM IST

దాదాపు 7 వారాల సుధీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 8 నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లో ఎంట్రీ ఇస్తుండగా… కెప్టెన్ రోహిత్ శర్మ, కెెఎల్ రాహుల్, పంత్ , బూమ్రా వంటి స్టార్ ప్లేయర్స్ అందరూ ఈ సిరీస్ లో ఆడుతున్నారు. బంగ్లాదేశ్ తో గత రికార్డుల్లో మనదే పై చేయిగా ఉంది. ఆ జట్టుపై తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన టీమిండియా ఇప్పటి వరకూ 13 టెస్టులు ఆడింది. వీటిలో భారత్ 11 గెలవగా… 2 మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి.

సొంతగడ్డపై భారత్ ను ఓడించడం ఏ జట్టుకు అంత ఈజీ కాదు. ఇటీవలే పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను మరింత పటిష్టం చేసుకునేందుకు బంగ్లాపై 2-0తో క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. అందుకే పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగిన భారత్ కు బంగ్లా ఎంతవరకూ పోటీనిస్తుందో చూడాలి. మొదటి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న చెపాక్ స్టేడియం పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా. ఇదిలా ఉంటే ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ , ఆస్ట్రేలియాలతో రోహిత్ సేన టెస్ట్ మ్యాచ్ లు ఆడబోతోంది.