ETALA PROBLEM : ఈటలను ఓడిస్తాం ! అడ్డం తిరిగిన బీజేపీ లీడర్లు

ఈటల రాజేందర్ (Etala Rajender) కి బీజేపీలో కష్టాలు తప్పడం లేదు. ఆయనకు మల్కాజ్ గిరి ఎంపీ టిక్కెట్ ఇస్తారో లేదో ఇంకా తెలియదు కానీ ఆ నియోజకవర్గంలో అప్పుడే అసమ్మతి మొదలైంది. ఈటలని నిలబడితే మేం పనిచేయం... ఓడిస్తాం అంటూ మల్కాజ్ గిరి (Malkaj Giri) నియోజకవర్గంలో బీజేపీ లీడర్లు మొండికేస్తున్నారు.

ఈటల రాజేందర్ (Etala Rajender) కి బీజేపీలో కష్టాలు తప్పడం లేదు. ఆయనకు మల్కాజ్ గిరి ఎంపీ టిక్కెట్ ఇస్తారో లేదో ఇంకా తెలియదు కానీ ఆ నియోజకవర్గంలో అప్పుడే అసమ్మతి మొదలైంది. ఈటలని నిలబడితే మేం పనిచేయం… ఓడిస్తాం అంటూ మల్కాజ్ గిరి (Malkaj Giri) నియోజకవర్గంలో బీజేపీ లీడర్లు మొండికేస్తున్నారు. ఏళ్ళ తరబడిగా పనిచేస్తున్న లోకల్ వాళ్ళకి టిక్కెట్ ఇవ్వకుండా… నాన్ లోకల్ కి ఇస్తారా అని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు.

మల్కాజ్ గిరి బీజేపీ టిక్కెట్ తనకే కన్ఫమ్ అయిందని ఈమధ్యే శామీర్ పేట్ (Sameera Pate) లో తన నివాసంలో ఈటల రాజేందర్ అనుచరులతో మీటింగ్ పెట్టి చెప్పారు. ఈ సమావేశానికి మల్కాజ్ గిరి నియోజకవర్గం బీజేపీ క్యాడర్ ను పిలిచినా… చాలా మంది అటెండ్ కాలేదు. ఈటలకే టిక్కెట్ అని తెలిసినప్పటి నుంచీ … స్థానిక బీజేపీ లీడర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆయన్ని నిలబెడితే సహకరించలేదు లేదని ఖరాకండీగా కమలం పార్టీ పెద్దలకు చెప్పేశారట. టిక్కెట్ అడుగుతున్న వారికి బీజేపీలో కనీసం ఐదేళ్ళయినా అనుభవం లేకపోతే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మల్కాజ్ గిరిలో 35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళల్లో లోకల్ లీడర్ ఎవరూ లేరా… వాళ్ళని కాదని… నాన్ లోకల్ ఈటలకు ఎలా ఇస్తారని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు.

హైదరాబాద్ లోకల్ బీజేపీ లీడర్లంతా కొంపెల్లిలో అత్యవసరంగా సమావేశమై… ఈటలకు వ్యతిరేకంగా పనిచేయాలని డిసైడ్ చేశారు. తమలో ఎవరికి ఇచ్చినా కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. బీజేపీ అధిష్టానం ప్రకటించకుండా తనకు తానుగా ఈటల ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిన వ్యక్తికి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తాము ప్రచారం చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఏ ఆత్మగౌరవం కోసం తనను గెలిపించాలని హుజూరాబాద్ లో ఈటల అడిగారో… ఇప్పుడు తమ ఆత్మగౌరవం కోసం మల్కాజ్ గిరిలో ప్రచారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లోకల్ కేడర్ ని కాదని మల్కాజ్ గిరి ఎంపీ టిక్కెట్ ఈటల రాజేందర్ కి ఇస్తే ఓడించి తీరుతామంటున్నారు. ఈటలకు బీజేపీ ఎంపీ టిక్కెట్ వస్తుందో రాదో తెలియదు గానీ… అసమ్మతి తీవ్రంగా ఉండటంతో ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంటుందా అనే డౌట్స్ వస్తున్నాయి.