తెలంగాణ (Telangana) లో గత ప్రభుత్వం.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ (KCR) ఆనవాళ్లు పూర్తిగా చేరిపేసే దిశకా చర్యలు జరుగుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పలుమార్లు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో నీ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పుకోచ్చిన విషయం తెలిసిందే…
కాగా ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్నికల ముందు వరకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మూడు నెలల పాలనలో ఏం చేశావు అని అడిగితే.. మూడు నెలల్లో ఏం చేయగలుగుతాం.. అనీ కనీసం 5 నెలలు సమయం అవుతుందని.. అంతలో లోక్ సభ ఎన్నికల (Lok Sabha elections) కోడ్ రావడంతో.. నా చేతిలో ఏం లేదు.. అంత కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లిపోయింది అంటూ బదులిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి..
ఇక ఎట్టకేలకు లోక్ సభ ఎన్నికలు కూడా ముగిశాయి.. మరి కొన్ని రోజుల్లో వాటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఇక నా దృష్టి అంతా… పాలన పై పెడతానని గొప్పలకు పోయాడు.. కానీ సీఎం తీరు మళ్లీ మొదటికే వచ్చినట్లు అయ్యింది. ఎందుకు అంటారా..? ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతుంది అని ఎవరైనా అడిగితే.. గత బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ పాలన వ్యవస్థను.. రాష్ట్ర చిహ్నాలను.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపే పాలన జరుగుతుంది చెప్పవచ్చు.. దీనికి గొప్ప ఉదహరనే.. ఇప్పుడు మీరు చదవబోయేది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2 నాటికి సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది. దీంతో కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నహాలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం తామే ఇచ్చానని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ గత 9 సంవత్సరాలుగా అధికారం కు దూరంగా ఉంది. దీంతో ఈ సారి తెలంగాణ అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇక్కడి వరకు బాగుంది.. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రభుత్వం విడుదల చేయనుంది. దీనికి ప్రముఖ సంగీత గేయ రచయిత.. ఆస్కర్ అవార్డ్ గ్రహిత MM కీరవాణి తో చర్చలు కూడా జరిపారు సీఎం రేవంత్ రెడ్డి.. ఇక కీరవాణి ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్నికి సంగీతం అందించే పనిలో పడ్డారు. అంతుకు ముందు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం లో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మార్పులు చేయించి రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక.. గత ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను.. చారిత్రాత్మక మైన కాకతీయుల నాటి.. కాలతోరణం తో పాటుగా.. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ అద్భుత కట్టడం చార్మినార్ ఈ రెండిటిని కలిపి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా ఆమోదించి అన్ని ప్రభుత్వ కార్యలయంలో ఈ చిహ్నమే వినియోగంలో ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కొత్త చిహ్నంను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. దీనికి ముందు తెలంగాణలో TS పేరును TG గా మార్చేసింది. ఇక తాజాగా తెలంగాణలో ఆర్టీసీ లోగోను పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఆర్టీసీ లోగో మాదిరిగా మార్చినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా దాదాపు TG&AP RTC లోగో మాదిరిగా ఉంది అని ప్రతిపక్ష పార్టీలతో సహా.. ప్రతి ఒక్కరు ట్వీటర్ వేధికగా ట్వీట్ల వర్షం కురుపిస్తున్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ కు సంబంధించిన ఒక్క అనవాలు కూడా ఉండకూడదని.. నేరుగా ఒక ముఖ్యమంత్రిగా పని కట్టుకొని మరి.. దగ్గరుండి ఈ పనులు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమైవుతుంది. కాగా లోక్ సభ ఫలితాల తర్వాత రాష్ట్రంలో ఇంకే పేర్లు.. మారుస్తారో.. ఇంకేన్ని చిహ్నాలు మారుస్తారో వేచి చూడాలి…
Suresh SSM