సఫా చేశారు, సౌతాఫ్రికాను విండీస్ క్లీన్ స్వీప్

టీ ట్వంటీ వరల్డ్ కప్ రన్నరప్ సౌతాఫ్రికాకు కరేబియన్ గడ్డపై ఘోరపరాభవం ఎదురైంది. సొంతగడ్డపై చెలరేగి ఆడిన వెస్టిండీస్ టీ ట్వంటీ సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 02:11 PM IST

టీ ట్వంటీ వరల్డ్ కప్ రన్నరప్ సౌతాఫ్రికాకు కరేబియన్ గడ్డపై ఘోరపరాభవం ఎదురైంది. సొంతగడ్డపై చెలరేగి ఆడిన వెస్టిండీస్ టీ ట్వంటీ సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ కు దిగిన సౌతాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. దీంతో విండీస్ టార్గెట్ ను 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ణయించారు. ఓపెనర్ 116 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ కేవలం 9.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. హోప్, షెపర్డ్ , పూరన్ రెచ్చిపోవడంతో కరేబియన్ టీమ్ కేవలం 9.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. తొలి రెండు మ్యాచ్ ల్లోనూ విండీస్ జట్టే గెలిచింది.