Coach Jai Simha : హైదరాబాద్ బిడ్డలకు.. ఇంత అవమానామా..! కోచ్‌ జై సింహా ప్రవర్తనే కారణం..?

హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మ్యాచ్‌ ఆడే నిమిత్తం ఉమెన్‌ టీమ్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్‌ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు.

హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మ్యాచ్‌ ఆడే నిమిత్తం ఉమెన్‌ టీమ్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్‌ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్‌ మిస్‌ అవడంతో టీమ్‌తో సహా బస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో బస్‌లో మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జై సింహా మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు. జట్టు నుంచి తప్పిస్తానంటూ క్రికెటర్లను బెదిరించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో జట్టుతో పాటే ఉన్న సెలక్షన్‌ కమిటీ మెంబర్‌ పూర్ణిమరావు జై సింహను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మహిళా క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు తీసుకోవడంలో హెచ్ సీఎ ఆలస్యం చేసినట్టు సమాచారం.

దీనికి సంబంధించిన వీడియోలు మీడియాలో రావడంతో ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. మహిళల హెడ్‌కోచ్‌గా జై సింహాను తప్పించింది. ఈ విషయంపై హెచ్‌సీఏ అ‍ధ్యక్షుడు జగన్మోహన్ రావు స్పందిస్తూ. కోచ్ జై సింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామన్నారు,. విచారణ ముగిసే వరకు అతడిని సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఊపేక్షించేది లేదని స్పష్టం చేశారు.