ఎవరి దారి వారిది.. ఎవరి మాటలు వారివి అన్నట్లు సాగిన ఏపీ రాజకీయం.. ఒక్కరాత్రిలో భగ్గుమంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ వ్యవహారంలో ఎవరి వాదన.. వారిదే ! అన్నీ విచారించాకే చంద్రబాబును అరెస్ట్ చేశారని వైసీపీ మద్దతుదారులు అంటుంటే.. కుట్ర చేసి చంద్రబాబును అరెస్ట్ చేశారని.. వరుసగా రెండురోజులు సెలవులు చూసి.. బెయిల్ రాకుండా పన్నాగం పన్నారని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వివేకా కేసులో సొంత ఊళ్లో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయిన సీఐడీ అధికారులు.. జిల్లాలపర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబును ఎలా అరెస్ట్ చేయగలిగారు అంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
ఇదంతా ఎలా ఉన్నా.. చంద్రబాబు అరెస్ట్‌కు ముందు జరిగిన నాటకీయ పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే చంద్రబాబు అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేయవచ్చన్న వార్తలకు బలం చేకూరింది. ఇక అంతే.. అటు పోలీసుల హడావుడి.. ఇటు టీడీపీ శ్రేణుల హడావుడి. దీంతో నంద్యాలలో హైటెన్షన్ కనిపించింది. క్షణక్షణం ఉత్కంఠ. నెక్ట్స్ పోలీసులు ఏం స్టెప్ తీసుకుంటారో.. ఎలా అడ్డుకోవాలని టీడీపీ శ్రేణులు.. హోటల్ దగ్గరే ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను నంద్యాలకు పంపనున్నారన్న వార్తలతో అనుమానాలు మరింత పెరిగాయ్. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు హై అలర్ట్ అయిపోయారు.
అసలు ఇంత హడావుడిగా చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక కారణం ఏంటి.. ఏమైనా ఎఫ్‌ఐఆర్ నమోదైందా.. పోనీ కనీసం కారణం కూడా చెప్పలేదు. చంద్రబాబు బస చేసిన బస్ దగ్గరకు వెళ్లి డోర్ కొడితే ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆఘమేఘాల మీద డాక్టర్లను పిలిపించి చంద్రబాబుకు వైద్య పరీక్షలన్నీ చేయించడం క్షణాల్లో జరిగిపోయింది. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ తర్వాత చంద్రబాబును ఎక్కడికో తీసుకెళ్తున్నారో చెప్పలేదు. రూట్స్ మారుస్తూ చిత్రవిచిత్రాలకు పాల్పడుతున్నారు. అసలు ఈ అరెస్ట్‌కు మెయిన్ కారణం ఏంటనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలే ఏపీ సీఎం జగన్.. కక్షలు, కార్పణ్యాలు ఎక్కువ. మొండివాడు మాత్రమే కాదు.. ఏదనుకుంటే అది చేయాలనుకునే టైప్. కావాలనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చర్చ జరుగుతున్న సమయంలో.. సీఐడీ మీడియా ముందుకు వచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు A వన్‌గా ఉన్నరని.. అందుకే అరెస్ట్ చేశామని చెప్పారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఈ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. టీడీపీ మరింత దూకుడు చూపించే చాన్స్ ఉంది. దీనివల్ల కచ్చితంగా టీడీపీకి సింపథీ వర్కౌట్ అయ్యే చాన్స్ ఉంది. మరి వైసీపీ దీన్ని ఎలా ఎదుర్కొంటుదన్నది ఆసక్తికరంగా మారింది.