Hyderabad Murders : ఈ రాష్ట్రానికి ఏం అయింది.. ఈ నగరంలో ఏం జరుగుతుంది.. రెండు రోజుల్లో 7 హత్యాలా..? కాంగ్రెస్ పాలనలో క్షిణించిన శాంతి భద్రతలు.. ఇన్ని హత్యలు జరుగుతున్న నోరు మెదపని సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఎన్నికల ముందు మాజీ సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి. నగరంలో భయం భయంతో ప్రజలు బతకాల్సి వస్తుంది. నగరంలో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితులు వస్తాయి. అన్నట్లుగా తెలంగానలో అదే జరుగుతుంది. ఇక్కడ నగరంలో కర్ఫ్యూ విధించలేదు కానీ.. శాంతి భద్రతలు మాత్రం అదుపుతప్పినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఏం జరుగుతుంది.. హైదరాబాద్ శాంతి భద్రతలు క్షీణించాయా..? పాతబస్తీలో అల్లర్లు మొదలయ్యాయా..? హైదరాబాద్ నగరంలో హత్యలు.. హత్యాయత్నాలు.. అల్లర్లు.. యువత స్వైర విహారం.. తెలంగాణ సచివాలయం.. ట్యాంక్ బండ్ ఎదుట యువత బైక్ స్టంట్స్.. హైటెక్ సిటీ.. టీ హబ్ వద్ద కార్ రేసింగ్స్.. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది అన్నట్లుగా ఘటనలు.. తెలంగాణలో చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా అధికార పార్టీలో చలనం ఉండదా..? రాష్ట్రం హోం మంత్రి దృష్టికి రాలేదా..? తెలంగాణ DGPకి తెలియదా..? రాష్ట్ర CSకు పట్టడం లేదా…? కేవలం 24 గంటల్లో 5 హత్యలు.. మరుసటి రోజు 2 హత్యలు.. మరో 2 హత్యాయత్నాలు.. పలు ప్రాంతాల్లో రౌడి ముఖల దౌర్జన్యలాలు అసుల ఏం జరగుతుతుందో తెలుసుకుందా..? గడిచిన ఈ ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 మందికి పైగా హత్యలు..

  • రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిందే జరుగుతుందా..?

తెలంగాణ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఎన్నికల ముందు మాజీ సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి. నగరంలో భయం భయంతో ప్రజలు బతకాల్సి వస్తుంది. నగరంలో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితులు వస్తాయి. అన్నట్లుగా తెలంగానలో అదే జరుగుతుంది. ఇక్కడ నగరంలో కర్ఫ్యూ విధించలేదు కానీ.. శాంతి భద్రతలు మాత్రం అదుపుతప్పినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • ఇక విషయంలోకి వస్తే..

గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లో నిత్యం ఎక్కడో ఒక చోట హింసాత్మక ఘటనలు జరుగుతునే ఉన్నాయి. నగరంలో ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు గానీ, దోపిడీలు గానీ, అత్యాచారాలు గానీ, హత్యాలుగు గానీ, యువత అల్లర్లు గానీ జరుగుతునే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో కేవలం 24 గంటల్లో బహిరంగంగా 5 హత్యలు జరిగాయి. మరుసటి రోజు 2 హత్యలు.. మరో 2 హత్యాయత్నాలు జరిగాయి. దీంతో ఈ టాపిక్ నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజలు రాత్రిళ్లు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో నగరవాసులు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు.

  • 24 గంటల్లో నగరంలో హత్యలకు గురైంది వీళ్లే..

పాతబస్తీ శాలిబండలో నిమ్రా ఫాస్ట్‌ ఫుడ్‌ యజమాని దారుణ హత్యకు గురయ్యారు. తుకారాంగేట్‌ లోని అడ్డగుట్టలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చాడు. కాచిగూడ రైల్వే స్టేషన్‌ పరిధిలో ఖిజార్‌ అనే వ్యక్తిని దుండగలు నరికి చంపేశారు. సనత్‌ నగర్‌ లోని భరత్‌ నగర్‌ లో అజార్‌ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అసిఫ్‌ నగర్‌ లో అలీం అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి హత్య చేశారు. శాలిబండలో వజీద్‌, ఫకృద్ధీన్‌ అనే వ్యక్తులపై దుండగులు హత్యాయత్నం చేశారు. దీంతో యువకులు చాకచక్యంగా తృటిలో తప్పించుకున్నారు. ఇవాళ (22-జూన్-2024) ఉదయం 4 గంటలకు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీపట్నంలో మరో వ్యక్తి దారుణ హత్య చోటుచేసుకుంది.

  • పాతబస్తీలో నిఘా కొరత ఏర్పడిందా..?

హైదరాబాద్ దేశంలో శాంతి భద్రతలకు నిలయంగా గత పదేళ్లు నిలిచింది. శాంతిభద్రతలకు పెట్టిన పేరు భాగ్యనగరానికి పెట్టిన పేరు అన్నట్టుగా మారింది. దేశంలో క్రైమ్ రేట్ అతి తక్కువగా నమోదవుతున్న రాష్ట్రంగా హైదరాబాద్ నిలిచింది. పాతబస్తీలో రాత్రివేళల్లో ఎక్కువ నేరాలు జరగకుండా గతంలో పోలీసులు తరచూ గస్తీ నిర్వహించారు. ఇప్పుడు ఆ నిఘా తగ్గిందా.. అంటే అందులో అనుమానం లేదని చెప్పవచ్చు.. ఎందుకంటే గడిచిన 7 హత్యల్లో అన్ని పాతబస్తీలో జరగడం గమనర్హం.. పాతబస్తీలో.. కాలనీల్లో.. ప్రధాన రహదారులపై రాత్రుళ్లు నగర పోలీసులు పెట్రోలింగ్ లేకపోవడం వల్లే ఈ దారుణ హత్యలు జరుగుతున్నాయని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత వారంలో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. ఈ ఏడాది జనవరిలో బాలాపూర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ముబారక్‌ సిగర్‌ను హత్యకు గురయ్యాడు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా నగర ప్రజలు చూడాలేదంటున్నారు. నాలుగు రోజుల క్రితం నగరంలో మూడు హత్యలు జరిగాయి. ఫిబ్రవరిలో హైదరాబాద్ లో యూసఫ్ గూడ ఎల్ ఎన్ నగర్ లో బీజేపీ లీడర్ సింగోటం రాములు దారుణ హత్యకు గురయ్యారు.

  • అత్యచారం ఘటనలు..

పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం చేశారు. ఖమ్మంలో మణుగూరు మండలం వాగుమల్లారం గ్రామంలో పదేళ్ల బాలికపై గడిద శ్రీనివాస్‌ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూన్ 12న జరగ్గా, శుక్రవారం మణుగూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి జిల్లాలో తోటి మహిళా కానిస్టేబుల్ పై పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది.

  • నగరంలో గ్యాంగ్ వార్..

నగరంలో కిస్మత్‌పూర్‌కు చెందిన షేక్‌ ఇర్ఫాన్‌ డ్రైవర్‌.. రాత్రుళ్లు దారి దోపిడీలు, హత్యాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. లంగర్‌హౌజ్‌కు చెందిన రౌడీషీటర్‌ షేక్‌ ఇస్మాయిల్‌తో ఇర్ఫాన్‌కు శత్రుత్వం ఉంది. దీంతో వీరి మధ్య నిత్యం కాళీమందిర్ ప్రాంతాల్లో ఘర్షణలు వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్లాన్ ప్రకారం.. వీరి గ్యాంగ్ లో ఒక రౌడి షీటర్ ఈ సంవత్సరం జనవరిలో బాలాపూర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో తన అనుచరుల్లో ఒకరైన ముబారక్‌ సిగర్‌ను హత్య చేశాడు. ఈ కేసులో ఇస్మాయిల్ జైలుకు వెళ్లి ఈ మధ్యే బెయిల్ పై విడుదలయ్యాడు.

  • దొంగతనాలు, దోపిడీలు..

తాజాగా నగర శివారు ప్రాంతం అయిన మేడ్చల్ పట్టణంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. దొంగలు జ్యువెలరీ షాప్ లోకి బుర్ఖా వేసుకోని షాప్ ఓనర్ ను కత్తితో బెదిరించి నగలు డబ్బులు దొంగలించారు. ఈ తతంగం అంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

  • తెలంగాణలో జిల్లాలో రాజకీయ దాడులు.. హత్యలు..

హైదరాబాద్ : ఇప్పటికే వరుస హత్యలతో బెంబేలెత్తున్న నగర ప్రజలు మరో హత్య కలకలం రేపుతోంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీపట్నంలో ఇవాళ ఉదయం గంటలకు ఒక వ్యక్త హత్యకు గురయ్యారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌లో చురుకైన కార్యకర్త మల్లేశ్‌ యాదవ్‌ను భూ తగాదాల ముసుగులో హత్య చేశారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా : కొల్లాపూర్ నియోజకవర్గం మంత్రి జూపల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలో మాత్రం విచలవిడిగా దాడులకు పల్పడుతున్నారు. పెద్ద‌కొత్త‌ప‌ల్లి మండలం జొన్నలబోగుడ గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి అనుచరులపై దాడులకు పాల్పడ్డారు.

కొల్లాపూర్ : పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో మాజీ జవాన్ సీఎం మల్లేష్ దారుణంగా హత్యచేశారు.

వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి దారుణహత్య ఘటన కాంగ్రెస్ ప్రేరేపిత హత్యా అని పేర్కొంది.

నారాయణపేట జిల్లా : నారాయణపేట్ జిల్లాలో ఉట్కూరు మండలం చిన్న పొర్ల గ్రామంలో సంజీవ్ అనే వ్యక్తిని.. ఇద్దరు వ్యక్తులు పొలంలో కర్రలతో కొట్టి చంపారు.

పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లాలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో సల్వాజీ మాధవరావుపై నాలుగు సార్లు హత్యాయత్నాలు జరిగాయి. దీంతో రక్తపు మరకలతోనే పెద్దపల్లి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఫలితం లేకపోలేదు. తిరిగి బాధితుడినే జైలుకు పంపించిన వైనం..

సూర్యాపేట జిల్లా : ఇక సూర్యాపేట జిల్లాలోని అప్పనపల్లి మండలం కాసర్లపహాడ్ కు చెందిన మెండె సురేశ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు.

ములుగు జిల్లా : మంత్రి సీతక్క సొంత జిల్లాలో పట్టపగలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు కత్తులతో దాడికి వస్తున్నారు. ములుగులో వరుస దాడులపై ఒక్కసారి కూడా మంత్రి సీతక్క రివ్యూ కూడా చేయలేదు.

ఖమ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ & హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు మహేశ్‌ గౌడ్‌ సహా పలువురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ కొమ్మినేపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు చల్లా హరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దనియాకుల హనుమంతరావు కారుపై దాడి చేశారు. అంతటితో ఆగాడా అంటే.. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల ఇండ్లపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడి భయభ్రాంతులు సృష్టించారు.

  • తెలంగాణకు హోం మంత్రి లేరా..?

తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు.. ఇన్ని హత్యలు.. ఇన్ని దోపిడీలు.. ఇన్ని దాడులు జరగుతున్న రాష్ట్రం హోం మంత్రి ఏం చేస్తున్నారు..? రాష్ట్ర ప్రజలందరికీ ఇదొక్కటే ప్రశ్న.. తెలంగాణ డీజీపీ ఎక్కడ ఉన్నారు..? అసలు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు..? ఈ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్న ఆయనకు కనిపించడం లేదా..? అంటే అన్ని తెలుసు.. ఎందుకంటే తెలంగాణ హోం మంత్రి ఎవరు అని అడిగితే.. అది కూడా మన రేవంత్ రెడ్డి అనే చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు.. రాష్ట్ర హోం శాఖ.. రాష్ట్ర శాంతి భద్రతల శాఖ.. విద్యాశాఖ తన వద్దనే ఉంచుకున్నారు. రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగినా తన 6 నెలల కాలంలో ఒక్కసారి కూడా శాంతిభద్రత విషయంలో తెలంగాణ సచివాలయం ఒక్క రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదు.

Suresh SSM