Blue Whale Challenge: ఆ కిల్లర్ గేమ్ మళ్లీ వస్తోందా..? పిల్లలూ, పేరెంట్స్.. జాగ్రత్త..!

బ్లూ వేల్ గేమ్ మరోసారి వార్తల్లోకెక్కింది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్‌కు దూరంగా ఉండాలని పిల్లలకు హెచ్చరిస్తున్నారు. అందుకే తమ పిల్లలు ఈ గేమ్ ఆడుతున్నారేమో చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 04:52 PM IST

Blue Whale Challenge: బ్లూ వేల్ గేమ్.. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఆన్‌లైన్ గేమ్ ఇది. ఒక గేమ్ మనుషుల ప్రాణాలు కూడా తీయగలదు అని చూపించిన గేమ్ ఇది. అందుకే ఇండియా సహా అనేక దేశాలు ఈ గేమ్‌ను బ్యాన్ చేశాయి. అయితే, మారుతున్న టెక్నాలజీ కారణంగా కొన్ని దేశాల్లో మళ్లీ బ్లూ వేల్ అందుబాటులోకి వస్తోంది. గత నెలలో అమెరికాలో ఒక భారతీయ విద్యార్థి మరణానికి ఈ గేమే కారణమని తేలింది. దీంతో బ్లూ వేల్ గేమ్ మరోసారి వార్తల్లోకెక్కింది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్‌కు దూరంగా ఉండాలని పిల్లలకు హెచ్చరిస్తున్నారు.

YS JAGAN: జగన్ చేతిలో ఉంది రూ.7 వేలే.. ఆస్తి మాత్రం రూ.700 కోట్లు

అందుకే తమ పిల్లలు ఈ గేమ్ ఆడుతున్నారేమో చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బ్లూ వేల్ గేమ్ ఆడేవాళ్లు కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. అందుకే దీన్ని ప్రపంచం నిషేధించింది. ఇంతకీ ఈ గేమ్ ఎలా ప్రమాదకరం. దాదాపు పదేళ్లక్రితం ఈ గేమ్ పాపులర్ అయింది. నెట్, స్మార్ట్‌‌ఫోన్ వినియోగం పెరిగాక బాగా పాపులర్ అయిన గేమ్స్‌లో ఇదీ ఒకటి. ఈ గేమ్ ఎక్కువగా టీనేజ్ పిల్లలు, యువత ఆడుతారు. ఒక్కసారి దీనికి అట్రాక్ట్ అయితే.. మధ్యలో మానేయడం చాలా కష్టం. ఈ గేమ్ ఆడేక్రమంలో ఎక్కడో ఉన్న సీక్రెట్ గ్రూప్స్‌తో ప్లేయర్లు కనెక్ట్ కావాలి. ఇక వాళ్లు చెప్పిందే చేయాల్సి ఉంటుంది. బ్లూ వేల్ గేమ్ ఆడే ప్లేయర్లను గ్రూప్ సభ్యులు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంటారు. దాదాపు 50 రోజులు ఈ గేమ్ ఉంటుంది. ఇందులో రోజుకొక టాస్క్ ఇస్తారు. ఈ టాస్కులు రోజురోజూ ప్రమాదకరంగా మారుతుంటాయి. టాస్కుల్ కంప్లీట్ చేయకపోతే.. గ్రూప్ నిర్వాహకులు, గేమ్ మాస్టర్స్ బెదిరిస్తారు. కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడతామని హెచ్చరిస్తారు. గేమ్ ప్రారంభంలోనే కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు అన్నీ సేకరిస్తారు. దీంతో ప్లేయర్లు వాళ్లు చెప్పినట్లు వినాల్సిందే. మొదట ఈ గేమ్ మంచి మజా వస్తుంది.

కానీ, రానురాను సీరియస్‌గా మారుతుంది. ప్రమాదకరమైన టాస్కులు చేస్తూ వెళ్లాలి. ఈ గేమ్‌లో ఆటగాళ్లు తామెంత దూరం వెళ్లామో అర్థం చేసుకునేలోపే చాలా నష్టం జరిగిపోతుంది. గేమ్‌ను మధ్యలో వదిలేయలేరు. నిర్వాహకులు ఇచ్చే టాస్కులు కంప్లీట్ చేయాల్సిందే. చివరకు గేమ్ ముగిసే సమయానికి ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకోమని కూడా బెదిరిస్తారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక.. దీన్నుంచి బయటకు రాలేక కొందరు ప్లేయర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు 2015లో చాలా జరిగాయి. పలువురు యువకులు ఈ గేమ్ ఆడుతూ ఆత్మహత్య చేసుకోవడంతో అమెరికా, రష్యా, ఇండియా సహా అనేక దేశాలు బ్లూ వేల్ గేమ్‌ను నిషేధించాయి. అయితే, ఇటీవలి కాలంలో పెరిగిన టెక్నాలజీ వల్ల ఇతర మార్గాల్లో కొందరు ఈ గేమ్‌ను మళ్లీ డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఇకపై పేరెంట్స్ తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు బ్లూ వేల్ గేమ్ ఆడుతున్నారో.. లేదో.. ఒక కంట కనిపెట్టుకు ఉండాలని సూచిస్తున్నారు.