AP Skill Development Case: చంద్రబాబు కేసు విషయంలో జరగబోయేది ఇదేనా..?

చంద్రబాబు అరెస్ తరువాత బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకు ఈ కేసు ఇంత సంచలనంగా మరిందో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 08:23 AM IST

చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏం చెబుతోంది. చంద్రబాబు జైలుకు వెళ్తారా.. బెయిల్ మంజూరు అవుతుందా.. సీఐడీ అరెస్ట్ చేసిన విధానం సరైనదేనా.. వీటన్నింటిపై చట్టం ఏం సూచిస్తోందొ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిన్న చంద్రబాబును ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఎందుకు నోటీసులు ఇవ్వలేదు అన్న దానిని పరిగణలోకి తీసుకుంటే.. ఈ కేసులో చాలా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవే ఇప్పుడు కీలకంగా మారనుంది.  

అసలు 409 ఏం చెబుతోంది..

  • రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడటం.
  • తన సొంత అవసరాలకు సంబంధించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం.
  • చట్టప్రకారం చేయాల్సిన కార్యకలాపాలను చట్టవిరద్దంగా పాల్పడితే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు.
  • సెక్షన్ 409 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవితకాలం ఖైదు విధించే అవకాశం ఉంది.
  • ఈ సెక్షన్ కింద కేసు నమోదు అయితే ఎలాంటి సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయవచ్చు.
  • పైగా నాన్ బెయిలబుల్ గా కూడా పరిగణిస్తారు.

సన్ రైస్.. సన్ సెట్ నిబంధన బాబుకు వర్తించదా..?

సాధారణంగా చట్టంలో 146ఏ ప్రకారం సాక్ష్యాలను పొందుపరిచే వ్యక్తికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. అయితే చంద్రబాబు సాక్ష్యాలను అందించే వ్యక్తిగా ఇక్కడ కేసు నమోదు చేయలేదు. ఇతనే కీలకపాత్ర పోషించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నందున ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు. పైగా ఈ సూర్యోదయానికి ముందు.. సూర్యోదయానికి తరువాత అరెస్ట్ చేయకూడదు అనే వాదనలు కేవలం 15 సంవత్సరాల లోబడిన పిల్లలకు, మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ వీరు స్టేషన్ కి రాలేని పరిస్థితి ఉంటే అధికారులే సాక్షుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసరం అయితే మెజిస్ట్రేట్ పర్మిషన్ తో అరెస్ట్ చేయవచ్చు.

బెయిల్ ఎందుకు ఇవ్వరు..?

సాధారణంగా ఆర్థిక నేరాల్లో పాల్పడినప్పుడు నిందితులకు బెయిల్ మంజూరు చేసే విషయంలో కాస్త జాగ్రత్తలు వహించాలని గతంలో సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఆర్థిక నేరాలన్నీ హడావిడిగా జరిగే పరిస్థితి ఉండదు. ఒక నిర్థిష్ట ప్రణాళికలతో జరిగే అవకాశం ఉంటుంది. నిందితుడిని బయటకు పంపితే తన గ్రూప్ ద్వారా ఏమైనా చేసే అవకాశం ఉందన్న భావనతో బెయిల్ విషయంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇక్కడ చంద్రబాబు ఆర్థిక నేరాలకు పాల్పడలేదని అతని తరఫు న్యాయవాదులు వాదిస్తారు. దీనిని కోర్ట్ అంగీకరిస్తే బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. దీనికి తగిన సాక్షాలను జడ్జి ముందు ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది.

హైకోర్ట్.. సుప్రీం కోర్ట్ కు వెళ్ళే అవకాశం ఉందా..?

ఒక వేళ ఏసీబీ కోర్టులో జుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తారా లేక సీఐడీ కస్టడీ కోరతారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జుడీషియల్ కస్టడీ కోరి వారు ఎప్పుడు విచారణకు హాజరవమని ఆదేశిస్తే అప్పుడు సహకరిస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. దీనిపై సీఐడీ కూడా తన అభిప్రాయం తెలుపవచ్చు. ఇలా ఇరువురి వాదనలు విన్న తరువాత ఏసీబీ కోర్ట్ ఏలాంటి తీర్పు వెలువరిస్తుందన్న దానిపై ముందుకుసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇరువురిలో ఎవరికి అనుకూలంగా తీర్పు రాకపోయినా హైకోర్టులో ఫిటీషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అది సీఐడీ కస్టడీ కోరుతూ వేయవచ్చు. చంద్రబాబు బెయిల్ కోసం కూడా పిల్ దాఖలు చేయవచ్చు. ఒక వేళ హైకోర్టులో వచ్చే తీర్పు ఆధారంగా సుప్రీం కోర్టుకు వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.

T.V.SRIKAR