హోరాహోరీగా సాగిన ప్రచారం ఒక ఎత్తు అయితే కొన్ని చెదురుమదురు ఘటనలు.. కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు తప్పితే… ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది అని చెప్పాలి. తమ పార్టీకి ఎలాగైనా సరే ఓటు వేయాల్సిందేనంటూ భీష్మించుకున్న ఓటర్లు నగర జీవనానికి కాస్త విరామం ఇచ్చి మరీ స్వస్ధలాలలకు తరలి వె్‌ళ్లారు. స్వగ్రామాలకు వెళ్లి ఓటెత్తారు. ముఖ్యంగా మహిళలు,వృద్ధులు అయితే కొన్ని చోట్ల భానుడి ప్రతాపానికి సవాలు విసిరారు. ఎలక్షన్ కమిషన్ చేసిన తూతుమంత్రం ఏర్పాట్లపై నిరసన ప్రదర్శిస్తూనే క్యూ నుంచి మాత్రం పక్కకు తప్పుకోలేదు. ఓటు వేసేందుకు గంటలకు గంటలు వరుసలో నిల్చుని ఓటేసారు. కొన్ని చోట్ల రాత్రి 11గంటల వరకు కూడా పోలింగ్ జరిగిన నేపధ్యంలో ….ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 78.36 శాతం పోలింగ్ నమోదు కాగా…. అమలాపురంలో 83.19 శాతం ఎక్కువగా నమోదుకాగా తక్కువగా విజయ నగరంలో 80.06 శాతం నమోదు అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోలింగ్ శాతాన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజిస్తే…ఆ పోలింగ్ శాతాన్ని చూస్తే….అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకుని మొత్తంగా 78.36 నమోదు కాగా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుకుంటే 78.25పోలింగ్ శాతం నమోదు అయింది.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారిగా పోలింగ్ శాతం..
2019లో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతం 1.38 శాతం తగ్గింది. జిల్లాల వారీగా నమోదు అయిన పోలింగ్ శాతాన్ని చూస్తే….అల్లూరిజిల్లాలో 63.19శాతం నమోదు కాగా అనకాపల్లి జిల్లాలో 81.63 శాతం, అనంతపురం జిల్లాలో 79.25 శాతం,అన్నమయ్య జిల్లాలో 76.12 శాతం, బాపట్ల జిల్లాలో 82.33 శాతం,చిత్తూరుజిల్లాలో 82.65 శాతం, కోనసీమ జిల్లాలో 83.19 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 79.31 శాతం,ఏలూరు జిల్లాలో 83.04 శాతం,గుంటూరుజిల్లాలో 75.74 శాతం,కాకినాడ జిల్లాలో 76.37 శాతం, కృష్ణా జిల్లాలో 82.20 శాతం, కర్నూలుజిల్లాలో 75.83 శాతం, నంద్యాల జిల్లాలో 80.92 శాతం,ఎన్టీఆర్ జిల్లాలో 78.76 శాతం,పల్నాడు జిల్లాలో 78.70 శాతం,పార్వతీపురం జిల్లాలో 75.24 శాతం, ప్రకాశంజిల్లాలో 82.40 శాతం, నెల్లూరు జిల్లాలో 78.10 శాతం, సత్యసాయిజిల్లాలో 82.77 శాతం,శ్రీకాకుళం జిల్లాలో 75.41 శాతం,తిరుపతి జిల్లాలో 76.83 శాతం,విశాఖపట్నం జిల్లాలో 65.50 శాతం, విజయనగరంజిల్లాలో 79.41 శాతం,పశ్చిమగోదావరి జిల్లాలో 81.12 శాతం,కడపజిల్లాలో 78.71 శాతం,అత్యల్పంగా అల్లూరిజిల్లాలో 63.19 శాతం నమోదు కాగా అధికంగా కోనసీమ జిల్లాలో 83.19 శాతం నమోదు అయింది.
జిల్లాల వారీగా నమోదు అయిన పోలింగ్ శాతాన్ని బేస్ చేసుకుని ఓవరాల్ గా చూసుకుంటే…ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతాన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజిస్తే…ఆ పోలింగ్ శాతాన్ని చూస్తే…. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 78.36 నమోదు కాగా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తంగా 78.25పోలింగ్ శాతం నమోదు అయింది.అంటే నిన్న మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో నమోదు అయిన పోలింగ్ శాతం 78.36 శాతం మాత్రమే. ఈ పోలింగ్ శాతాలు, పోటెత్తిన ఓటర్లతో ఎవరికి లాభం, ఎవరు గద్దెనెక్కబోతున్నారు, అధికారపార్టీ తమ పట్టునిలుపుకుంటుందా లేక కూటమి రికార్డ్ క్రియేట్ చేయబోతోందా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న. క్లియర్ కట్ గా కాకున్నా మెజారిటీ క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఓసారి గతాన్ని పలుకరించాల్సిందే.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో నమోదు అయిన పోలింగ్ 80.39 శాతం. ఇప్పుడు నమోదు అయిన పోలింగ్ శాతం 78.36 మాత్రమే …అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 కోట్ల 96 లక్షల ఓట్లలో దాదాపు 3 కోట్ల 16 లక్షల ఓట్లు పోల్ అయ్యాయని ఎన్నికల కమిషన్ లెక్కలు చెబుతోంది. ఇప్పుడు 4కోట్ల 14లక్షల పై చిలుకు ఓట్లు ఉన్నాయి. ఇప్పుడెన్ని పోల్ అయ్యాయి, ఎంతమంది ఓటుహక్కు వినియోగించుకున్నారనేది క్లియర్ కట్‌గా తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి 2019తో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ దాదాపు 3శాతం తగ్గిందనేది నిప్పులాంటి నిజం. సర్వసాధారణంగా పొలిటికల్ ట్రెండ్స్ ప్రకారం పోలింగ్ శాతం పెరిగితే….ప్రతిపక్షానికి అనుకూలం అని పొలిటికల్ పండితులు, విశ్లేషకులు చెబుతారు.అదే పోలింగ్ శాతం తగ్గితే మాత్రం అధికార పార్టీకి అనుకూలమే అనే వాదన కూడా ఉంది.
ఇవి రెండు నిజమేనా అనుకుంటే అందుకు కూడా గ్యారంటీ లేదు. ఉదాహరణకు… తెలంగాణ ఇందుకు తీసిపోని సాక్ష్యం. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే 2023లో జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతం తగ్గింది. ఇందాక చెప్పుకున్నట్లు పోలింగ్ శాతం తగ్గితే రూలింగ్ పార్టీకి మేలు జరగాలి కదా కానీ తెలంగాణలో అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ గెలిచిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నిచోట్లా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. టీఆరెస్ గెలిచిన స్ధానాల్లో గతం కంటే పోలింగ్ శాతం తగ్గింది. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇదే ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనే ప్రశ్న ఇప్పుడు విశ్లేషకులను పట్టి పీడిస్తోంది.
ఏది ఏమైనా సరే అటు అధికార పార్టీ పవర్‌లోకి వచ్చినా లేక కూటమి కొత్తగా పగ్గాలు చేపట్టినా సరే కేవలం రెండు శాతం తేడాతోనే ఎవరైనా సరే పాలనా పగ్గాలు చేపడతారనేది సత్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సంక్లిష్ఠ తీర్పు ఇవ్వనున్నారు ఇవ్వబోతున్నారు అనేది సుస్పష్ఠం. ఎవరు ఎన్ని లెక్కలు చెప్పినా ఎవరు ఎంతగా మాట్లాడుకున్నా తప్పకుండా ది బిగ్ జడ్జ్‌మెంట్ డే జూన్ 4 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఓటర్ల తీర్పుతో కాకలు తీరిన రాజకీయ విశ్లేషకులు సైతం నోళ్లు వెళ్లబెట్టాల్సి రావచ్చు…. ముక్కున వేలు వేసుకోవాల్సి రావచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు!