భారీగా పెరిగిన బంగారం ధర 10 గ్రాములు ఎంతంటే?

బంగారాన్ని బాగా ఇష్టపడేవాళ్లకు ఇది నిజంగా బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకూ కాస్త తగ్గినట్టే కనిపించన బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 13, 2024 / 06:35 PM IST

బంగారాన్ని బాగా ఇష్టపడేవాళ్లకు ఇది నిజంగా బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకూ కాస్త తగ్గినట్టే కనిపించన బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా వెయ్యికి పైగా బంగారం ధరలు అమాంతం పెరగిపోయాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 12 వందలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 13 వందలు పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మార్కెట్‌లో 68 వేల 250కి చేరింది ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 74 వేల 450కి చేరింది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి.

కానీ శుక్రవారం 1300 పెరగడంతో తులం బంగారం 75వేల వరకు చేరింది. బంగారం ధరలు నిన్న స్వల్పంగా పెరగగా.. నేడు ఊహించని విధంగా ఏకంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1200.. 24 క్యారెట్ల 10 గ్రాముల 1,300 పెరిగింది. మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లు, యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఉన్నందున తీవ్రమైన ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే మన దేశంలో బంగారం పెరగడానికి మరో కారణం ఏంటంటే.. వరుసగా దసరా, దీపావళి, ధనత్రయోదశి, పెళ్లిళ్ల సీజన్ వస్తున్న తరుణంలో బంగారం ధరలు రోజురోజుకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, వెండి విషయానికొస్తే.. వెండి ధరలు కూడా షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇవాళ ఏకంగా కిలో వెండిపై 3000 పెరిగింది. దీంతో మార్కెట్‌లో కిలో వెండి 89 వేల 500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంలలో కిలో వెండి 95 వేలకు చేరువలో ఉంది.