సినిమా నటుల (Tollywood) మధ్య స్నేహం అనేది మనం చూస్తూనే ఉంటాం. వారి వ్యక్తిగత జీవితంలో కూడా తమ సినీ స్నేహితులను ఆహ్వానిస్తూ ఒక కుటుంబ సభ్యుడుగా చూస్తూ ఉంటారు. ఇది గతంలో స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య బాగా నడిచింది. వారి మధ్య స్నేహం ప్రేమగా మారి వివాహాలు కూడా చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు యువ హీరోలు (Young heroes) హీరోయిన్ల మధ్య పెళ్ళిళ్ళు అయినా సరే స్నేహం కొనసాగుతూనే ఉంది. తాజాగా కీర్తి సురేష్ (Keerthy Suresh) వీడియో లో చెప్పిన మాటలు అయితే ఫాన్స్ కి బాగా నచ్చాయి.
Pushpa 2 : యూట్యూబ్ లో తగ్గేదేలే అంటున్న పుష్ప…
హీరో నాని (Nani) తో అలాగే అతని కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ఆమె చెప్పుకొచ్చింది. నానీ కొడుకుతో ఉన్న అనుబంధం కూడా బయట పెట్టింది కీర్తి. నాని, తన వైఫ్, వాళ్ల కొడుకు అందరూ నాకు చాలా క్లోజ్ అని చెప్తూ… ఇప్పుడైతే వాడు కొంచెం పెద్దయ్యాడు కానీ చిన్నప్పుడు నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేవాడని గుర్తు చేసుకుంది. వాడు చాలా క్యూట్ గా మాట్లాదతాడని… తన పుట్టిన రోజుకి పంపిన వాయిస్ నోట్ గురించి కీర్తి బయట పెట్టింది. అది ఒకసారి వినిపిస్తా వినండి అంటూ వినిపించింది.
Ramayanam : మహేష్, రాజమౌళి కాదు.. ఇదే మొదటి వెయ్యి కోట్ల సినిమా
నన్న వాడు అత్తా అని పిలుస్తాడు అని… వాడు మిస్ యూ, సీ యూ అన్న పదాలను భలే క్యూట్‌గా పలుకుతాడని చెప్పుకొచ్చింది. మూసీ, సూయూ అంటాడు. నేను ఎప్పుడైనా కాస్త డౌన్‌గా ఉన్నప్పుడు ఈ వాయిస్ నోట్ వింటుంటానని, ఇది సేవ్ చేసి పెట్టుకున్నానని చెప్పింది. నేను ఇంటికి వెళ్లిన ప్రతిసారి నా బుగ్గ కొరికేంతలా ముద్దు పెడుతుంటాడు జున్ను అంటూ మురిసిపోయింది. ఆ ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని… నాని ఫ్యామిలీ (Nani family) నా కుటుంబం అయిపోయిందని చెప్పుకొచ్చింది ఆమె. నేను హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారి వాళ్ల ఇంటికి వెళ్తూనే ఉంటానని తెలిపింది ఈ కేరళ కుట్టీ.