WhatsApp feature: వాట్సాప్‌లో రీసెంట్లీ ఆన్‌లైన్ కాంటాక్ట్ ఫీచర్.. ఇంతకీ ఇది ఎలా పని చేస్తుందంటే..

తాజాగా రీసెంట్లీ ఆన్‌లైన్ అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. యూజర్లు చూసే టైమ్‌లో లేదా అంతకుముందు ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో ప్రత్యేక సెక్షన్‌లో కనిపిస్తుంది.

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 06:49 PM IST

WhatsApp feature: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్.. వాట్సాప్. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది వాట్సాప్. తాజాగా రీసెంట్లీ ఆన్‌లైన్ అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో ఈజీగా తెలుసుకోవచ్చు.

MS DHONI: ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా..? రైనా ఏమన్నాడంటే..

యూజర్లు చూసే టైమ్‌లో లేదా అంతకుముందు ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో ప్రత్యేక సెక్షన్‌లో కనిపిస్తుంది. ఇలాంటి ఫీచరే ఇప్పుడూ ఉంది. అయితే, వాళ్లు ఆన్‌లైన్‌లో ఉన్నారో.. లేదో చూడాలంటే వారి ప్రొఫైల్ చెక్ చేయాలి. ఇలా ప్రతిసారి చెక్ చేస్తేనే వారు ఆన్‌లైన్‌లో ఉన్నారో.. లేదో తెలుస్తుంది. అలాగే ఎంతమంది ఆన్‌లైన్‌లో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే.. అంతమంది ప్రొఫైల్ చెక్ చేయాలి. అయితే, ఇకపై ఇలా ఎవరి ప్రొఫైల్ చెక్ చేయకుండానే వాళ్ల ఆన్‌లైన్ యాక్టివిటీ గురించి తెలుసుకోవచ్చు. అలాగని అందరి గురించిన సమాచారం తెలియదు. కొందరు రీసెంట్ యాక్టివ్‌గా ఉన్న వారి ఆన్‌లైన్‌ స్టేటస్ మాత్రమే తెలుసుకోవచ్చు.

అది కూడా రెగ్యులర్‌గా చాట్ చేసే కాంటాక్ట్స్‌కు సంబంధించిన ఆన్‌లైన్ యాక్టివిటీని మాత్రమే చూపిస్తుంది. ఇందుకోసం ఒక ప్రత్యేక ఆల్గారిథమ్ పని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది.