What’s App Updates: అరడజనుకుపైగా సరికొత్త వాట్సప్ ఫీచర్స్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. రానున్న కాలానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తూ శభాష్ అనిపించుకుంటోంది ఈ దిగ్గజ మెటా యాప్. అక్టోబర్ లో అరడజన్ కి పైగా సరికొత్త ఫీచర్లను మీ ముందుకు తీసుకొచ్చేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తోంది ఈ సంస్థ.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 09:06 AM IST

వాట్సప్ అంటే నేటియుగంలో ప్రతి ఒక్కరూ తమ సందేశాన్ని అత్యంత త్వరగా ఇతరులకు చేరవేసేందుకు ఉపయోగించే ఒక యాప్. దీని ద్వారా అన్ని రకాలైన డేటాను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అది కూడా దేశవిదేశాలకు పంపించవచ్చు. అందుకే ప్రస్తుతం 200 కోట్లకు పైగా యూజర్లను కలిగి అగ్రస్థానంలో నిలిచింది ఈ సంస్థ. దీని వినియోగదారులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వాట్సప్ యాప్ ను సరికొత్తగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. గతంలో లేని ఎన్నో రకాల ఫీచర్లను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన, ఉపయోగకరమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాలు చేయనుంది. అతి త్వరలో బీటా వినియోగదారులకు ఉపయోగంలోకి తీసుకురానున్నట్లు ఈ సంస్థ తన బ్లాగ్ లో రాసుకొచ్చింది.

సీక్రెట్ కోడ్ ఫీచర్..

వాట్సప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానుంది. అదే సీక్రెట్ కోడ్ ఫీచర్. మన వాట్సాప్ లో చాలా పర్సనల్ మెసేజ్ లను చాట్ చేస్తూ ఉంటాం. కొందరైతే వీడియోలు, ఇమేజ్ లు పంపిస్తూ ఉంటారు. ఆ ఫైల్స్ ను వీటిని గోప్యంగా ఉంచేందుకు చాట్ లాక్ అందుబాటులోకి వచ్చింది. ఈ చాట్ ను ఒక లాక్ ఏర్పాటు చేసి రహస్యంగా ఉంచిన మెసేజ్ లను త్వరగా కనుగొనేందుకు సీక్రెట్ కోడ్ అనే ఆప్షన్ ను తీసుకురానుంది. దీనిని ఒక ఫౌల్డర్ లాగా క్రియేట్ చేయవచ్చు. ఆ ఫౌల్డర్ కోడ్ ను రెండు అక్షరాల నుంచి రెండు పదాల వరకూ దేనినైనా పాస్ వర్డ్ గా నమోదు చేయవచ్చు. లేకుంటే ఇమోజీని కూడా ఎంచుకోవచ్చు. తద్వారా మనం రహస్యంగా ఉంచిన మెసేజ్ లు ఒక ఫౌల్డర్లో కోడ్ రూపంలో భద్రపరచి ఉంటాయి. సర్చ్ బార్ పై మనం ఏర్పాటు చేసిన కోడ్ నమోదు చేస్తే చాలా ఆ సీక్రెట్ మెసేజ్ లు కనిపింస్తాయి. దీనిని కేవలం వినియోగదారుల గోప్యతను, రక్షణను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ప్రస్తతం ప్రయోగ దశలో ఉంది. రానున్న రోజుల్లో బీటా యూజర్లకు అందుబాటులోకి రానుంది.

పిన్/ బయోమెట్రిక్ అథంటికేషన్..

సీక్రెట్ మెసేజ్ లను చూసేందుకు ప్రత్యేక ఫౌల్డర్ క్రియేట్ చేసి వాటికి కోడ్ ఏర్పాటు చేయవచ్చు. ఆ కోడ్ నమోదు చేసిన తరువాత పిన్ లేదా వేలిముద్రను ఉంచితేనే గోప్యంగా ఉంచిన మెసేజ్ లు ఓపెన్ అయ్యేందుక వీలయ్యేలా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అంటే చాట్ లాక్ కి అనుసంధానం చేస్తూ ఈ సరికొత్త ఫీచర్ ను అప్డేట్ చేయనుంది.

సెర్చ్ ఫీచర్..

ప్రస్తుతం అన్ని వాట్సప్ యూజర్లకు స్టేటస్ లో ఛానల్స్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని అనుసరిస్తూ మరో కొత్త అప్డేట్ ను తీసుకురానుంది మోటా సంస్థ. వాట్సప్ టాప్ బార్ లో కొత్త సర్చ్ బటన్ ను ప్రవేశపెడుతోంది. దీనిని ఉపయోగించి యూజర్లు తాము ఎంచుకున్న ఛానల్స్ లో పెట్టిన సమాచారాన్ని స్టేటస్ ల రూపంలో చూడవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం ద్వారా ఛానల్ డైరెక్టరీని తెరవాల్సిన పనిలేదు. గతంలో ఫాలో అయిన ఛానల్ తో పాటూ దానిని అనుసరించిన ఛానల్స్ వివరాలు సర్చ్ బార్లో నమోదు చేస్తే సరిపోతుంది.

పిన్న్డ్ మెసేజెస్..

ఈ పిన్న్డ్ మెసేజ్ ఫీచర్ ద్వారా మనం చాట్ చేసే అంశాలను ఎంపిక చేసుకున్న లిస్ట్ ఆధారంగా ఇతరులకు చేరవేస్తాయి. ఇందులో మనం ప్రియారిటీని పిన్ రూపంలో ఎంచుకోవాలి. ముందు ఏ మెసేజ్ వెళ్లాలి.. తరువాత ఏ మెసేజ్ వెళ్లాలో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటూ ఏ రోజున వెళ్లాలి, ఎన్ని గంటలకు ఇతరులకు మీ సందేశం చేరవేయాలో టైం, డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే పుట్టిన రోజు శుభాకాంక్షలను ముందుగా టైం, డేట్ సెలెక్ట్ చేసి పంపించేందుకు వెసులుబాటు ఉంటుంది.

రీడిజైన్ చాట్ అటాచ్మెంట్..

మనం వాట్సప్ చాట్ చేసేటప్పుడు చాట్ అటాచ్మెంట్ ను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఇందులోనే సంబంధిత ఫోటోలు, వీడియోలు, డేటా మొత్తం ఉంటుంది. ఈ చాట్ అటాచ్మెంట్ ను సరికొత్త రూపంలో రీడిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల వాట్సప్ లుక్ తో పాటూ మీడియా ఫైల్స్, చాట్ బ్యాగ్రౌండ్, షేరింగ్ విధానంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రైవసీ టూల్..

మనం వాట్సప్ ఉపయోగించి వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాం. ఇది సహజంగా అందరూ చేసే ప్రక్రియే. ఇలా చేసే క్రమంలో నెట్ ఆన్లో ఉంటే చాలు ఏ నంబర్ నుంచి అయినా మనకు వాట్సప్ కాల్ రావచ్చు. దానిని మనం లిఫ్ట్ చేసి మాట్లేడే క్రమంలో మన డివైజ్ ఐపీ అడ్రస్ హాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు ఐపీ అడ్రస్ కు ఎలాంటి విఘాతం కలుగకుండా రక్షణ కల్పించేలా సరికొత్త ప్రైవసీ టూల్ ను వాట్సప్ అందుబాటులోకి తీసుకురానుంది.

వాయిస్ స్టేటస్..

ఇప్పటి వరకూ మనం వాట్సప్ లో ఫోటోలు, వీడియోలు, యూట్యూబ్ లింకులు, వెబ్ సైట్ లింకులు మాత్రమే స్టేటస్ లో పెట్టుకునేవాళ్ళం. ఇకపై వాయిస్ రికార్డ్లు, మీకు నచ్చిన పాటలు, డైలాగ్స్ కి సంబంధించిన ఆడియో ఫైల్ కూడా వాట్సప్ స్టేటస్లో పెట్టుకునేలా వాయిస్ స్టేటస్ అనే సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ కాంటాక్ట్‌లకు స్టేటస్ అప్‌డేట్ రూపంలో వాయిస్ మెసేజ్ పంపవచ్చు. ఫీచర్‌ని ఉపయోగించడానికి, WhatsAppలో ‘స్టేటస్’ ట్యాబ్‌కి వెళ్లి, దిగువన ఉన్న ‘పెన్సిల్’ గుర్తును ఎంచుకోండి. తదుపరి స్క్రీన్‌లో, మైక్రోఫోన్ చిహ్నంపై నొక్కి 30 సెకన్ల వరకు మీ వాయిస్ సందేశాన్ని రికార్డ్ చేయడం ప్రారంభించండి.

T.V.SRIKAR