Whatsapp Bundh in India: అలాగైతే… ఇండియాలో వాట్సాప్ సేవలు బంద్ !

వాట్సాప్ (WhatsApp) మెస్సేజ్ ల ఎన్ క్రిప్షన్ ను తీసేయాలని కోరితే ఇండియాలో వాట్సాప్ సేవలను బంద్ చేస్తామని మెటా సంస్థ హెచ్చరించింది. వాట్సాప్ లో మెస్సేజ్ లు సీక్రెట్ గా ఉంచుతాం. ఎండ్ – టు –ఎండ్ ఎన్ క్రిప్ట్ చేయడం వల్ల జనం ఎక్కువగా ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు.

వాట్సాప్ (WhatsApp) మెస్సేజ్ ల ఎన్ క్రిప్షన్ ను తీసేయాలని కోరితే ఇండియాలో వాట్సాప్ సేవలను బంద్ చేస్తామని మెటా సంస్థ హెచ్చరించింది. వాట్సాప్ లో మెస్సేజ్ లు సీక్రెట్ గా ఉంచుతాం. ఎండ్ – టు –ఎండ్ ఎన్ క్రిప్ట్ చేయడం వల్ల జనం ఎక్కువగా ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. జనం నమ్ముతున్న ఈ హామీని ఉల్లంఘించాల్సి వస్తే ఇండియాలో వాట్సాప్ మూసేయడం బెటర్ అని మెటా సంస్థ తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకి తెలిపారు.

సోషల్ మీడియా కోసం భారత ప్రభుత్వం అమలు చేసిన 2021 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) నిబంధనలను సవాల్ చేస్తూ వాట్సాప్, దాని మాతృ సంస్థ Facebook Inc, Meta ఫైల్ చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు విచారించింది. మెసేజింగ్ యాప్(messaging app) లో చాట్స్ ని ట్రేస్ చేయడానికి, గుర్తించడానికి సంబంధించి నిబంధనలను రూపొందించడంపై మెటా సంస్థ తరపు లాయర్ అభ్యంతరం చెప్పారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021ని కేంద్రం 2021 ఫిబ్రవరి 25న ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం Twitter, Facebook, Instagram, WhatsApp లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం నడుచుకోవాలి. వాట్సాప్ తరపున న్యాయవాది తేజస్ కరియా కోర్టులో వాదనలు వినిపించారు. చట్టం ప్రకారం ప్రభుత్వం ఏవైనా మెస్సేజ్ లను డీక్రిప్ట్ చేయమని అడిగితే తమకు కష్టమవుతుందని వివరించారు. మిలియన్ల కొద్దీ మెస్సేజ్ లను కొన్నేళ్ళ పాటు స్టోర్ చేయడం సాధ్యం కాదన్నారు.
ఇలాంటి చట్టం మరే దేశంలోనైనా ఉందా అని ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం. అయితే ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి రూల్ లేదనీ… బ్రెజిల్‌లో కూడా లేదని చెప్పారు మెటా లాయర్. మత పరమైన హింస లాంటి కేసుల్లో ఈ ప్లాట్‌ఫామ్స్ పై అభ్యంతరకర వార్తలు సర్క్యులేట్ అయితే ప్రమాదమనీ… అలాంటప్పుడు ఈ నిబంధన చాలా ముఖ్యమని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు.

2021 ఐటీ నిబంధనలలోని అంశాలను సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్లను ఢిల్లీకి బదిలీ చేసి… ఆగస్ట్ 14న జాబితా సమర్పించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. కర్ణాటక, మద్రాస్, కోల్ కతా, కేరళ, బొంబాయి సహా వివిధ హైకోర్టుల్లో ఈ సమస్యపై అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.