Nominations Muhurtham: నామినేషన్లకు మంచి ముహూర్తాలు ఎప్పుడంటే !

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 18న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది.

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 18న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని పార్టీలు చాలా స్థానాల్లో తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి. దాంతో నియోజకవర్గాల ప్రచారం ఊపందుకుంది.

అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు…తమ నామినేషన్ పత్రాలను ఫైల్ చేసేందుకు మంచి ముహూర్తాల కోసం వెతుకుతున్నారు. పండితులను ఆశ్రయిస్తూ తమ జాతకం ప్రకారం ఏ రోజు బాగుందని తెలుసుకుంటున్నారు. ఆ రోజు నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించనుంది ఎన్నికల కమిషన్.

ఈనెల 18న గురువారం దశమి, ఆశ్లేష నక్షత్రం, 19న శుక్రవారం ఏకాదశి, మఖ నక్షత్రం ఉన్నందున ఈ రెండు రోజుల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని చెబుతున్నారు. 24న బుధవారం పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం కూడా చాలా బాగుంది. ఆ రోజూ నామినేషన్లు వేస్తే లాభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈనెల 21న త్రయోదశి, ఉత్తర నక్షత్రం… అన్నింటికంటే ఈ రోజు ఇంకా బాగుందని తెలిపారు. అందుకే ఈనెల 21న లక్షల పెళ్లిళ్లకు ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకున్నారు. 21న ఆదివారం సెలవు రోజు కాబట్టి నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం లేదు. దాంతో ఆ రోజు కూడా నామినేషన్లకు ఈసీ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. అభ్యర్థులు తమ జాతకం ప్రకారం మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. మొత్తమ్మీద ఈ నెలలో 18, 19, 24న ముహూర్తాలు అందరికీ బాగున్నాయి. వీటన్నింటికంటే 21 ఇంకా మంచి రోజు అయినా ఆరోజు ఆదివారం కావడంతో నామినేషన్లు వేయడానికి అవకాశం లేదు.