ఐపీఎల్ మెగా వేలం కోల్ కతా రిటైన్ ప్లేయర్స్ ఎవరంటే ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. ఈ ఏడాది చివర్లో వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ జాబితాపై దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ నలుగురు ఆటగాళ్ళను కొనసాగించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 02:45 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. ఈ ఏడాది చివర్లో వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ జాబితాపై దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ నలుగురు ఆటగాళ్ళను కొనసాగించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను కోల్ కతా రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి. 17వ సీజన్ లో సారథిగానే కాదు బ్యాట్ తోనూ రాణించిన శ్రేయాస్ 351 పరుగులు చేశాడు. గత మూడు సీజన్లుగా నైట్ రైడర్స్ ను సమర్థవంతంగా లీడ్ చేస్తున్నాడు.

శ్రేయాస్ తర్వాత ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ను కోల్ కతా ఫ్రాంచైజీ ఖచ్చితంగా తమతో పాటే కొనసాగించుకోనుంది. 2024 సీజన్ లో నరైన్ బంతితో పాటు బ్యాట్ తోనూ అదరగొట్టి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు. 180కి పైగా స్ట్రైక్ రేట్ తో 488 పరుగులు చేసిన నరైన్ బౌలింగ్ లోనూ రాణించి 17 వికెట్లు పడగొట్టాడు. నరైన్ జట్టుకు చక్కని బ్యాలెన్స్ తెస్తాడని చెప్పొచ్చు. ఈ విండీస్ ప్లేయర్ మరో రెండు మూడు సీజన్లు ఐపీఎల్ ఆడే అవకాశముంది.

అలాగే విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఖచ్చితంగా రిటైన్ చేసుకోనుంది. గత కొన్నేళ్ళుగా రస్సెల్ కోల్ కతా విజయాల్లో కీలకంగా మారిపోయాడు. 17వ సీజన్ లో 19 వికెట్లు తీయడంతో పాటు 222 పరుగులు కూడా చేశాడు.దీంతో ఈ విండీస్ హిట్టర్ ను వేలంలోకి వదిలే అవకాశాలు లేనట్టే. ఇక వెంకటేశ్ అయ్యర్ , వరుణ్ చక్రవర్తిలలో ఒకరిని రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి.