Asia Cup 2023: ఫైనల్స్ లో వర్షం పడితే ఆసియా కప్ 2023 ఎవరిది?

ఆసియా కప్ 2023లో అకాలంగా రద్దైతే పరిస్థితి ఏంటి.

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 05:04 PM IST

ఆసియా కప్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మీద విజయం సాధించిన భారత్, శ్రీలంక ఆసియా కప్ టైటిల్ పోరులో రేపు తలపడనున్నాయి. కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ఆర్ ప్రేమదాస స్టేడియా ఆతిథ్యమివ్వనుంది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. ఎలా అయినా ఈ సారి కూడా టైటిల్ గెలిచి భారత్ రికార్డు‌ను సమం చేయాలనే యోచనలో ఉంది.

ఆసియా కప్ టోర్నీలో 7 సార్లు విజేతగా నిలిచిన భారత్ మాత్రం తన లెక్కను మరింతగా పెంచుకోవాలని భావిస్తోంది. పైగా ఆసియా కప్ టోర్నీ ఫైనల్‌లో ఇప్పటికే ఇరు జట్లు 7 సార్లు పోటీపడగా.. భారత్ 4 సార్లు, లంక 3 సార్లు గెలిచింది. కొలంబో వాతావరణ నివేదిక ప్రకారం.. భారత్ vs శ్రీలంక ఆసియా కప్ ఫైనల్ సమయంలో వర్షం పడేందుకు దాదాపు 72 శాతం అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా సెప్టెంబర్ 17న ఆట ఆడకుంటే మరుసరి రోజు అంటే సెప్టెంబర్ 18న ఆడేందుకు రిజర్ డేని ప్రకటించింది ఏసీసీ.

రెండు రోజుల్లోనూ మ్యాచ్ ఫలితం తేలకుంటే.. భారత్-శ్రీలంక ఆసియా కప్ 2023 టైటిల్‌ ఉమ్మడి విజేతగా నిలుస్తాయి. కాగా, ఇలా టైటిల్ పంచుకోవడం ఇదే తొలి సారి కాదు. చాంంపియన్స్ ట్రోఫీ 2002 ఫైనల్‌లో భారత్, శ్రీలంక తలపడగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు దేశాల జట్లను చాంంపియన్స్ ట్రోఫీ 2002 విజేతగా ప్రకటించారు.