ఐపీఎల్ 17వ (IPL 17) సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bangalore) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) యువ పేసర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగాడు. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసి ఈ సీజన్‌లోనే ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందుకున్నాడు. మయాంక్ యాదవ్ ధాటికి ఆర్‌సీబీ బ్యాటర్లు గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. మయాంక్ ఫాస్టెస్ట్ డెలివరీకి మ్యాక్స్‌వెల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. కామెరూన్ గ్రీన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
151 కిలోమీటర్ల వేగంతో వేసిన షార్ట్ ఆఫ్ లెంగ్త్ బాల్‌ను మ్యాక్స్‌వెల్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతిలో పడింది. తన మరుసటి ఓవర్‌లో నాలుగో బంతికే కామెరూన్ గ్రీన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతి గ్రీన్ బ్యాట్‌ను మిస్సై వికెట్‌ను లేపేసింది. ప్రస్తుతం మయాంక్ యాదవ్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మయాంక్ దేశీవాళీ క్రికెట్‌లో దిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు తరపున మూడు ఫార్మాట్లలోనూ అతడు అరంగేట్రం చేశాడు. మొదట రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అనంతరం లిస్ట్-ఏ, టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మంచి పేసర్‌గా గుర్తింపు సాధించాడు.