Lok Sabha Elections : మెదక్‌లో ఎవరి బలం ఎంత.. ఏ పార్టీ జెండా ఎగరబోతోంది ?

ఓ వైపు ఎండలు.. మరోవైపు ఎన్నికల వేడి.. జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. ఏపీ సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణలో పొలిటికల్ యుద్ధం పీక్స్‌కు చేరింది. అధికారం గాలివాటం కాదని నిరూపించుకునేందుకు ఓ పార్టీ.. భవిష్యత్‌ తమదే అని బల్లగుద్ది చెప్పేందుకు ఇంకో పార్టీ.. తాము ఓడలేదు వాళ్లు గెలిచారు అంతే అని చెప్పేందుకు మరో పార్టీ.. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్‌, బీజేపీ.. ఎంపీ ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయ్.

 

 

 

ఓ వైపు ఎండలు.. మరోవైపు ఎన్నికల వేడి.. జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. ఏపీ సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణలో పొలిటికల్ యుద్ధం పీక్స్‌కు చేరింది. అధికారం గాలివాటం కాదని నిరూపించుకునేందుకు ఓ పార్టీ.. భవిష్యత్‌ తమదే అని బల్లగుద్ది చెప్పేందుకు ఇంకో పార్టీ.. తాము ఓడలేదు వాళ్లు గెలిచారు అంతే అని చెప్పేందుకు మరో పార్టీ.. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్‌, బీజేపీ.. ఎంపీ ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయ్. మెజారిటీ స్థానాల్లో విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయ్. కొన్ని లోక్‌సభ స్థానాలను.. మూడు పార్టీలు సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నాయ్. ముఖ్యంగా కరీంనగర్‌, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాలపై మూడ పార్టీలు ప్రధానంగా దృష్టిసారించాయ్.

మెతుకుసీమ మెదక్‌ ఫైట్‌.. మరింత ఆసక్తి రేపుతోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ నుంచి నీలం మధు పోటీ చేస్తుంటే.. బీఆర్ఎస్ తరఫున మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు బరిలో ఉన్నారు. ముగ్గురు కూడా బలమైన అభ్యర్థులే కావడంతో.. మెదక్ లోక్‌సభ స్థానంలో ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఉంది. ఉద్యమ సమయంలో ఆయన ఎంతో కీలకంగా వ్యవహరించారు. పైగా మంచి మాటకారి కూడా ! తన ప్రసంగాలతో ఓటర్లను ఇట్టే ఆకట్టుకోగలరు. పైగా మోదీ వేవ్‌ కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయ్.

ఇక బీఆర్ఎస్‌ (BRS) అభ్యర్థి వెంకటరామిరెడ్డి (Venkatrami Reddy) గతంలో ఎమ్మెల్సీ (MLC) గా పనిచేసిన అనుభవం ఉంది. కలెక్టర్‌గా ఉన్న సమయం నుంచే.. మెదక్ జిల్లాలోని చాలా గ్రామాలతో మంచి అనుబంధం ఉంది. మెదక్‌లో సొంత ఇల్లు కట్టుకొని.. స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటాననే సంకేతాలు పంపుతున్నారు. కలెక్టర్‌గా చేసిన మంచే తనను గెలిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు.. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే ఎన్నికల ముందు వరుసగా పార్టీలు మారడం ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు.. కాంగ్రెస్‌ నుంచి బీఎస్పీకి.. బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌కు.. మూడు నెలల కాలంలో నాలుగు పార్టీలు మారారనే ప్రచారాన్ని ప్రత్యర్థులు జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఐతే నీలం మధుకు.. సామాజికవర్గంవారీగా మంచి ఫాలోయింగ్‌ ఉంది. యువతలోనూ ఆయనకు మంచి పేరు ఉంది. ఇలా ముగ్గురు అభ్యర్థులు విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. దీంతో మెదక్‌ ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.