PAVAN MODI LEGS : సముద్రం ఎందుకు తలవంచింది? మోడీ కాళ్ళు మొక్కడంతో పవన్ పై సెటైర్లు

ఏపీలోని రాజమండ్రి (Rajahmundry) లో కూటమి సభలో ప్రధాని నరేంద్ర మోడీకి... జనసేనాని పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కడంపై వివాదం నడుస్తోంది. బానిసత్వానికి కూడా హద్దు ఉండాలి అంటూ పవన్ పై సోషల్ మీడియాలో నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తరుచుగా చెప్పే... సముద్రం ఎవరి ముందు తలవంచదు డైలాగ్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఏపీలోని రాజమండ్రి (Rajahmundry) లో కూటమి సభలో ప్రధాని నరేంద్ర మోడీకి… జనసేనాని పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కడంపై వివాదం నడుస్తోంది. బానిసత్వానికి కూడా హద్దు ఉండాలి అంటూ పవన్ పై సోషల్ మీడియాలో నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తరుచుగా చెప్పే… సముద్రం ఎవరి ముందు తలవంచదు డైలాగ్ ను ట్రోల్ చేస్తున్నారు.

రాజమండ్రిలో టీడీపీ(TDP), జనసేన (Janasena Party), బీజేపి (BJP) సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) పాల్గొన్నారు. వేదికపైకి వచ్చిన ప్రధానికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. తర్వాత టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) శాలువా కప్పి సన్మానించారు. ఆ తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రధానికి స్వాగతం పలికారు… శాలువా కప్పిన తర్వాత వెంటనే… మోడీ కాళ్ళకు నమస్కరించారు పవన్. మోడీ ఓ వైపు వద్దని వారిస్తున్నా వినకుండా కాళ్ళపై పడ్డారు పవన్. పైకి లేవనెత్తిన మోడీ… అలా చేయొద్దంటూ… చేతులతో సైగ చేయడం కనిపించింది.

మోడీ కాళ్ళను పవన్ మొక్కడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది. తెలుగు రాష్ట్రాలను చీల్చిన వ్యక్తికి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని వ్యక్తి కాళ్ళు మొక్కుతావా… మోడీ అంటే భయమా అని పవన్ ని ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజెన్స్. తెలుగువాడి గౌరవాన్ని గుజరాతీ ముందు తాకట్టు పెట్టాడని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ (YCP) శ్రేణులైతే ఓ రేంజ్ లో పవన్ ను ఆడుకుంటున్నారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొదనీ… తలవంచదు… మొరగదు అని చెప్పే పవన్ కల్యాణ్… ఇప్పుడు మోడీ కాళ్ళ మీద ఎందుకు పడ్డారని ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఈ కామెంట్లను జత చేసి ట్వీట్ చేస్తున్నారు. అయితే పవన్ చర్యకు మరికొందరు నెటిజన్లు మద్దతు ఇస్తున్నారు. పెద్ద వాళ్ళని గౌరవించడాన్ని తప్పుబట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. అవును… సముద్రం ఎవరికీ తలవంచదు… పవన్ కల్యాణ్ కూడా అంతే అంటూ సమాధానం చెబుతున్నారు. వైసీపీ, పవన్ అభిమానుల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తోంది.